News


ఇక గోద్రేజ్‌ ఎయిర్‌ కూలర్లు

Friday 24th January 2020
news_main1579835762.png-31151

  • 3 కేటగిరీల్లో 17 మోడళ్లు 
  • ధరలు రూ.12,300-19,900 రేంజ్‌లో 

న్యూఢిల్లీ: గృహోపకరణాల సంస్థ, గోద్రేజ్‌ అప్లయెన్సెస్‌ ఎయిర్‌ కూలర్ల సెగ్మెంట్లోకి ​ప్రవేశించింది. ఇన్వర్టర్‌ టెక్నాలజీతో రూపొందిన ఎయిర్‌ కూలర్లను మార్కెట్లోకి తెచ్చామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది పేర్కొన్నారు. ఈ కూలర్ల వాడకం వల్ల విద్యుత్తు 50 శాతం అవుతుందని మూడేళ్లలో రూ.3,000 వరకూ పొదుపు చేయవచ్చని వివరించారు. మూడు కేటగిరీల్లో (ఇన్వెర్టర్‌, ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌ సిరీస్‌) మొత్తం 17 మోడళ్లను మార్కెట్లోకి తెచ్చామని పేర్కొన్నారు. వీటి ధరలు రూ.12,300 నుంచి రూ.19,900 రేంజ్‌లో ఉన్నాయని వివరించారు. 
ఐదేళ్లలో 15 శాతం వాటా....
భారత్‌లో ఎయిర్‌ కూలర్ల మార్కెట్‌ రూ.6,000 కోట్లని, తొలి ఏడాది 4 శాతం వాటా, ఐదేళ్లలో 15 శాతం మార్కెట్‌ వాటా సాధించాలని లక్ష్యాలుగా పెట్టుకున్నామని తెలిపారు. You may be interested

2024 నాటికి 69 శాతం పనులు ఆటోమేషనే

Friday 24th January 2020

గార్ట్‌నర్‌ సంస్థ అంచనా బెంగళూరు: ప్రస్తుతం మేనేజర్ల స్థాయిల్లో జరుగుతు‍న్న పనుల్లో 69 శాతం 2024 నాటికి ఆటోమేషన్‌ (యంత్రాలు) అవుతాయని అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ‘గార్ట్‌నర్‌’ అధ్యయనం పేర్కొంది. వర్చువల్‌ పర్సనల్‌ అసిస్టెన్స్‌, చాట్‌బాట్స్‌ వంటి అత్యాధునిక టెక్నాలజీలు మేనేజర్లపై పని భారం తగ్గించనున్నాయని తెలిపింది. మేనేజర్‌ పాత్ర నాలుగేళ్ల కాలంలో పూర్తిగా మారిపోబోతుందని పేర్కొంది. ‘‘ప్రస్తుతం మేనేజర్లు పత్రాలను నింపడం, తాజా సమాచారాన్ని పొందుపరచడం, పనులను ఆమోదించడం వంటి

కెనరా బ్యాంక్‌కు తగ్గిన మొండి బకాయిలు

Friday 24th January 2020

4 శాతం పెరిగిన నికర లాభం  ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక కాలంలో రూ.330 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.318 కోట్లుతో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని కెనరా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,513 కోట్ల నుంచి రూ.14,002 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగుపడింది.

Most from this category