News


ఐపీఓకు గో ఎయిర్‌!

Saturday 29th June 2019
news_main1561780332.png-26671

  •  ఇష్యూ సైజు రూ.1,700- 2,000 కోట్లు
  •  డిసెంబర్ లేదా జనవరిలో పబ్లిక్‌ ఇష్యూ

ముంబై: బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ, గో ఎయిర్‌ త్వరలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. గతంలో ఐపీఓ ప్రణాళికను అటకెక్కించిన ఈ కంపెనీ నిధుల సమీకరణ నిమిత్తం ఐపీఓకు సిద్ధమవుతోందని తెలిసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌, బోంబే డైయింగ్‌వంటి కంపెనీలను నిర్వహిస్తున్న వాడియా గ్రూప్‌ నేతృత్వంలోని ఈ కంపెనీ, తన ఐపీఓ కోసం సిటీ, మోర్గాన్‌ స్టాన్లీ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే మర్చంట్‌ బ్యాంకర్లు, అడ్వైజరీ సంస్థల నియామకం ఖరారు కానున్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి.
ఇష్యూ సైజు రూ.2,000 కోట్ల రేంజ్‌లో...!
గో ఎయిర్‌ ఈ ఐపీఓ ద్వారా రూ.1,728- 2,047 కోట్ల​శ్రేణిలో నిధులు సమీకరించే అవకాశాలున్నాయి. ఐపీఓ సంబంధిత కసరత్తు ప్రాథమిక దశలోనే ఉండటంతో ఇష్యూ సైజుపై ఇంకా స్పష్టత రాలేదు. విమానయాన రంగంలో చివరగా వచ్చిన ఐపీఓ అంటే ఇండిగో ఐపీఓనే చెప్పుకోవాలి. 2015, అక్టోబర్‌లో ఇండిగో విమానయాన సంస్థను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ ఐపీఓకు వచ్చింది. రూ.765 ఇష్యూ ధరతో ఈ కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. ఇష్యూ ధర నుంచి చూస్తే, ఈ షేర్‌ దాదాపు రెట్టింపైంది. 
ఇదే సరైన సమయమని...
భారత విమానయాన రంగంలో ప్రస్తుతమున్న పరిస్థితులు... ఐపీఓకు రావడానికి గో ఎయిర్‌ను పురికొల్పుతున్నాయని నిపుణులంటున్నారు.  ఈ కంపెనీ వందకు పైగా ఎయిర్‌ బస్‌ ఏఏ320 నియోస్‌ విమానాలను ఆర్డర్‌ చేసింది. వీటికి చెల్లించడానికి భారీ మొత్తంలో నిధులు కావాలి. మరోవైపు భారీ రుణ భారంతో కుదేలైన జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో తన కార్యకలాపాలను నిలిపేసింది. ప్రస్తుతం భారత విమానయాన రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లో స్టాక్‌ మార్కెట్లో లిస్టైన విమానయాన సంస్థలు రెండే ఉన్నాయి. స్పైస్‌జెట్‌, ఇండిగో. స్టాక్‌ మార్కెట్లో లిస్టైన ఈ రెండు విమానయాన సంస్థల వేల్యూయేషన్లు అధికంగా ఉన్నాయని, తామ కూడా స్టాక్‌ మార్కెట్లో లిస్టయితే మంచి విలువ సాధించగలమని ఈ కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో గానీ, వచ్చే ఏడాది జనవరిలోగానీ ఈ కంపెనీ ఐపీఓ వచ్చే అవకాశాలున్నాయి. మొత్తం మీద మార్చికల్లా ఐపీఓ తప్పకుండా వస్తుందని సమాచారం. 
మార్కెట్‌ పరంగా నాలుగో స్థానం...
భారత విమానయాన రంగంలో గో ఎయిర్‌ది నాలుగో స్థానం. 11.1 శాతం మార్కెట్‌ వాటా ఈ కంపెనీకి ఉంది. విమాన సర్వీసులను సకాలంలో నడపడంలో గో ఎయిర్‌ కంపెనీయే అగ్రస్థానంలో ఉంది. నిర్వహణ పరంగా, ఆర్థిక పరంగా గో ఎయిర్‌ ట్రాక్‌ రికార్డ్‌ బావుందని నిపుణులంటున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.3,525 కోట్లుగా ఉన్న ఆదాయం 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,553 కోట్లకు పెరిగింది. నికర లాభం రూ.205 కోట్ల నుంచి 44 శాతం వృద్ధితో రూ.295 కోట్లకు పెరిగింది. 

కాగా మార్కెట్‌ ఊహాగానాలపై స్పందించబోమని గో ఎయిర్‌, సిటీ, మోర్గాన్‌ స్టాన్లీలు ఐపీఓ వార్తలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి.   You may be interested

జెట్‌ కోసం ఉద్యోగుల కన్సార్షియం బిడ్‌

Saturday 29th June 2019

ఆది గ్రూప్‌తో కలిసి 75 శాతం వాటా కొనుగోలుకు ప్రకటన న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసేందుకు ఆ సంస్థ ఉద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జెట్‌లో 75 శాతం వాటా దక్కించుకోవడానికి బిడ్‌ వేస్తామని.. ఇందుకోసం బ్రిటన్‌కు చెందిన ఆది గ్రూప్‌తో జట్టు కట్టామని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉద్యోగుల కన్సార్షియం శుక్రవారం ప్రకటించింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని 26 బ్యాం‍కుల కన్సార్షియం దాఖలు చేసిన దివాలా

5జీ స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయ్!!

Saturday 29th June 2019

2020లో వెల్లువలా కొత్త టెక్నాలజీ ఫోన్లు సిద్ధం చేసుకుంటున్న తయారీ కంపెనీలు రూ.15,000-20,000 శ్రేణిలోనూ లభించే చాన్స్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటి వరకు భారత మొబైల్‌ మార్కెట్లో 4జీ స్మార్ట్‌ఫోన్లనే చూశాం. వచ్చే ఏడాది నుంచి తదుపరి తరం 5జీ స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. దేశంలో 5జీ స్పెక్ట్రం వేలం 2020లో జరిగే అవకాశం ఉంది. స్పెక్ట్రం అందుబాటులోకి రాగానే కొత్త టెక్నాలజీతో మోడళ్లను ప్రవేశపెట్టేందుకు తయారీ కంపెనీలు రెడీ అయ్యాయి. ఇప్పటికే పలు

Most from this category