News


విదేశాలకు గోఎయిర్‌ సర్వీసులు రద్దు

Wednesday 18th March 2020
Markets_main1584501120.png-32541

ముంబై: కరోనా వైరస్ భయాలతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో విదేశాలకు ఫ్లయిట్ సేవలు నిలిపివేస్తున్నట్లు చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్‌ మంగళవారం వెల్లడించింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 15 దాకా సర్వీసులు ఉండవని పేర్కొంది. దీంతో రోజువారీ ఫ్లయిట్ల సంఖ్య 325 నుంచి 280కి తగ్గుతుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని వినియోగించుకునే క్రమంలో.. ఉద్యోగులకు రొటేషనల్ ప్రాతిపదికన స్వల్పకాలికంగా, తాత్కాలిక సెలవులు కూడా ఇస్తున్నట్లు గోఎయిర్‌ వివరించింది. ఈ వ్యవధిలో జీతభత్యాలు ఉండవు. దీంతో పాటు ఉద్యోగుల వేతనాలను క్రమంగా 20 శాతం మేర తగ్గించాలని గోఎయిర్‌ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

దివాలా అంచున ఎయిర్‌లైన్స్‌ ..
కరోనా కారణంగా ప్రయాణికుల సంఖ్య పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఫ్లైబీ సంస్థ ఇప్పటికే దివాలా తీయగా.. ఈ ఏడాది మే ఆఖరు నాటికి చాలా ఎయిర్‌లైన్స్ మూతపడే ప్రమాదముందని మార్కెట్ ఇంటెలిజెన్స్‌ సంస్థ సీఏపీఏ హెచ్చరించింది. పలు విమానయాన సంస్థలు ఉద్యోగాల్లో కోతకు సిద్ధమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు 50 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ఇవ్వాలంటూ అమెరికాలోని ఎయిర్‌లైన్స్ సంస్థల సమాఖ్య ప్రభుత్వాన్ని కోరింది. 

విమానరంగ నియంత్రణ సంస్థలకు మరిన్ని అధికారాలు..
పౌర విమానయాన రంగ నియంత్రణ సంస్థలైన డీజీసీఏ, బీసీఏఎస్‌, ఏఏఐబీ మొదలైన వాటికి మరిన్ని అధికారాలు, చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ఎయిర్‌క్రాఫ్ట్ (సవరణ) బిల్లు 2020ని పార్లమెంటు ఆమోదించింది. విమానయాన రంగ సంస్థలు .. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో విధించే జరిమానాను రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటికి పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉ‍న్నాయి. కరోనా వైరస్‌పరమైన సవాళ్ల నుంచి విమానయాన రంగం సత్వరం బైటికి రాగలదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ పురి ధీమా వ్యక్తం చేశారు.


 You may be interested

రాణా కపూర్‌పై కొత్తగా మరో కేసు

Wednesday 18th March 2020

యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్యపై ఈడీ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. అవంతా రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు గాను .. వారు రూ. 307 కోట్ల మేర ముడుపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక బంగ్లాను మార్కెట్ రేటులో సగం ధరకే దక్కించుకోవడం ద్వారా వారు లబ్ధి పొందినట్లు ఈసీఐఆర్‌లో  ఈడీ పేర్కొంది.

2020లో భారత్‌ వృద్ధి 5.3 శాతమే!

Wednesday 18th March 2020

- ఇంతక్రితం 5.4 శాతం అంచనాకు కోత - కోవిడ్‌-19 ప్రభావం ఉంటుందని విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2020లో 5.3 శాతమే ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థ- మూడీస్‌ తాజాగా అంచనావేసింది. ఫిబ్రవరిలో వేసిన 5.4 శాతం అంచనాలను 10 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) మేర కుదించింది. అంచనాల కుదింపునకు కోవిడ్‌-19 ప్రభావాన్ని కారణంగా చూపడం గమనార్హం.  2020 భారత్‌

Most from this category