News


జీఎంఆర్‌కు పెరిగిన నష్టాలు

Saturday 16th November 2019
news_main1573876480.png-29633

  • క్యూ2లో రూ.457 కోట్ల నికర నష్టం
  • టర్నోవరు రూ.2,018 కోట్లు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా‍స్ట్రక్చర్‌ నష్టాలు మరింత పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో రూ.457 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.334 కోట్ల నష్టం చవిచూసింది. టర్నోవరు రూ.1,904 కోట్ల నుంచి రూ.2,018 కోట్లకు చేరింది. ఎయిర్‌పోర్టుల విభాగం ఆదాయం రూ.1,315 కోట్ల నుంచి రూ.1,494 కోట్లకు పెరిగింది. విద్యుత్‌ విభాగం టర్నోవరు రూ.178 కోట్ల నుంచి రూ.167 కోట్లకు చేరింది. సెప్టెంబరు క్వార్టరులో ఢిల్లీ విమానాశ్రయంలో ప్యాసింజర్‌ ట్రాఫిక్‌ గతేడాది మాదిరిగా 1.73 కోట్లు నమోదు చేసింది. జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబరు త్రైమాసికం 10 శాతం వృద్ధి సాధించింది. 2019-20 జూలై-సెప్టెంబరు కాలంలో ఈ విమానాశ్రయం రూ.135 కోట్ల లాభం ఆర్జించింది. 2018-19 క్యూ2లో ఇది రూ.88 కోట్లు. గత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంతో పోలిస్తే ఈ సెప్టెంబరు క్వార్టరులో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి 3 శాతం వృద్ధితో 54 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ రూ.217 కోట్ల లాభం ఆర్జించింది. 



You may be interested

ఆర్‌కామ్‌ నష్టాలు రూ.30,142 కోట్లు

Saturday 16th November 2019

రూ.28,314 కోట్ల ఏజీఆర్‌ కేటాయింపులు  రూ.302 కోట్లకు తగ్గిన ఆదాయం  న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.30,142 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం దివాలా ప్రక్రియ నడుస్తున్న ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.1,141 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఏజీఆర్‌(సవరించిన స్థూల రాబడి) విషయమై సుప్రీం కోర్ట్‌ ఇచ్చిన తీర్పు కారణంగా రూ.28,314 కోట్ల కేటాయింపులు జరపడంతో ఈ

ఎగుమతులు... మూడవ నెలా ‘మైనస్‌’

Saturday 16th November 2019

  అక్టోబర్‌లో 1.11 శాతం క్షీణత విలువ 26.38 బిలియన్‌ డాలర్లు వాణిజ్యలోటు 11 బిలియన్‌ డాలర్లు న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతుల్లో వరుసగా మూడవనెలా ప్రతికూలతే నమోదయ్యింది. అక్టోబర్‌లో అసలు వృద్ధిలేకపోగా -1.11 క్షీణరేటు నమోదయ్యింది. అంటే 2018 అక్టోబర్‌తో పోల్చితే 2019 అక్టోబర్‌లో ఎగుమతుల విలువ -1.11 శాతం తగ్గి, 26.38 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. పెట్రోలియం (-14.6 శాతం), తివాచీ (-17 శాతం), తోలు ఉత్పత్తులు (-7.6 శాతం), బియ్యం (-29.5 శాతం),

Most from this category