News


రెండు విమానాశ్రయ ప్రాజెక్టుల రేసులో జీఎంఆర్‌

Saturday 18th January 2020
news_main1579319394.png-31007

హైదరాబాద్‌: మౌలిక రంగంలో ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ కొత్త విమానాశ్రయ ప్రాజెక్టుల వేటలో ఉంది. దక్షిణ యూరప్‌లోని మాంటినీగ్రోలో ఉన్న పోడ్గోరికా, టివట్‌ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికై ప్రాథమిక అర్హత (ప్రీ క్వాలిఫైడ్‌) సాధించిన నాలుగు కంపెనీల్లో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఒకటి. కన్సెషన్‌ పీరియడ్‌ 30 ఏళ్లు. జీఎంఆర్‌తోపాటు ఇన్షియాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్పొరేషన్‌, గ్రూప్‌ ఏడీపీ కాన్సార్షియం, కార్పొరేషన్‌ అమెరికా ఎయిర్‌పోర్ట్‌ ఈ పోటీలో ఉన్నాయి. 



You may be interested

యూఎస్‌ మార్కెట్ల రికార్డ్‌ ర్యాలీ

Saturday 18th January 2020

డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ రికార్డు మార్కెట్లు గత వారం నికరంగా 2% ప్లస్‌ ఇండియన్‌ ఏడీఆర్‌లలో డాక్టర్‌ రెడ్డీస్‌ జోరు పటిష్ట హౌసింగ్‌ గణాంకాల నేపథ్యంలో వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధించాయి. డిసెంబర్‌లో గృహ నిర్మాణాలు 13ఏళ్ల గరిష్టాన్ని తాకాయి. దీంతో మార్కె‍ట్లు మరోసారి చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిశాయి. శుక్రవారం(17న) డోజోన్స్‌ 0.17 శాతం బలపడి 29,348 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ-500 ఇండెక్స్‌ 0.4 శాతం ఎగసి 3,330

సంస్కరణలతోనే భారత్‌ భారీ వృద్ధి

Saturday 18th January 2020

ఐక్యరాజ్యసమితి నివేదిక న్యూఢిల్లీ: భారత్‌ భారీ ఆర్థిక వృద్ధి సాధనకు వ్యవస్థాగత సంస్కరణల కొనసాగింపు అవసరమని ఐక్యరాజ్యసమితి నివేదిక ఒకటి శుక్రవారం పేర్కొంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాలు 2020 పేరుతో ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను ఆవిష్కరించింది. ఒకవైపు సంస్థాగత, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లకు సంబంధించి వ్యవస్థాగత సంస్కరణలు మరోవైపు ప్రభుత్వ వ్యయాల ద్వారా మందగమనంలో ఉన్న ఆర్థిక వృద్ధిని మెరుగుపరచవచ్చని సూచించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...   2018లో భారత్‌ వృద్ధి

Most from this category