News


ఎయిర్‌పోర్టు బిజినెస్‌లో వాటా విక్రయించనున్న జీఎంఆర్‌!

Thursday 16th January 2020
news_main1579171738.png-30971

  • టాటా గ్రూప్‌ ఎంటీటీకి సొంతం కానున్న 49 శాతం వాటా

న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపార దిగ్గజ కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించనుంది. గురువారం తన ఎయిర్‌పోర్టు బిజినెస్‌లో 49 శాతం వాటాను టాటా గ్రూప్‌ కంపెనీ ఎంటీటీ టీఆర్‌ఐఎల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అమ్మనున్నట్లు జీఎంఆర్‌ వెల్లడించింది. అనేక వ్యాపారాలు కలిగి ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌ ఎయిర్‌పోర్ట్‌ బిజినెస్‌లోలో 44.44 శాతం వాటాను విక్రయిస్తున్నట్లు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తమ లావాదేవీలను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపింది. ఇంకా ఈ ఒప్పందం రెగ్యులేటరీ నిబంధనలకు లోబడి ఉంటుందని, దీనిలో ఎవరైనా షేర్లు కొనాలన్నా,అమ్మాలన్నా ఇబ్బంది ఉండదని పేర్కొంది.  ఈ వార్త వెలువడడంతో గురువారం బాంబే స్టాక్‌ఎక్సేంజ్‌లో  జీఎంఆర్‌ షేర్లు 1 శాతం పెరిగినప్పటికి ముగిసే సమయానికి స్వల్పంగా ముగిసాయి. 



You may be interested

సికాల్‌ లాజిస్టిక్స్‌లో 10.25 వాటా యస్‌ బ్యాంక్‌ సొంతం !

Thursday 16th January 2020

తనఖా షేర్లకు రుణం చెల్లించని సికాల్‌ లాజిస్టిక్స్‌  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగానికి చెందిన రుణదాత యస్‌బ్యాంక్‌ సికాల్‌ లాజిస్టిక్స్‌ తనఖా షేర్లను సొంతం చేసుకుంది. కాఫీ డే గ్రూపుకు చెందిన సికాల్‌ లాజిస్టిక్స్‌ యస్‌బ్యాంక్‌ దగ్గర కొన్ని షేర్లను తనఖా పెట్టింది. నిర్ణిత సమయానికి రుణం చెల్లించకపోవడంతో యస్‌ బ్యాంక్‌ సికాల్‌ లాజిస్టిక్స్‌ నుంచి 10.25 శాతం వాటాను సొంతం చేసుకుంది. యస్‌బ్యాంక్‌ సొంతం చేసుకున్న 60 లక్షల ఈక్విటీ షేర్లలో

ఒడిదొడుకుల మధ్య స్వల్ప లాభాలతో సరి

Thursday 16th January 2020

ఇంట్రాడేలో రికార్డ్‌ గరిష్టాలకు మార్కెట్లు నష్టాల బాటలో మెటల్‌ ఇండెక్స్‌  స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ఊగిసలాడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు ఇంట్రాడేలో మరోసారి సరికొత్త గరిష్టాలను తాకాయి. ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలి చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 60 పాయింట్లు బలపడి 41,932 వద్ద నిలవగా.. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 12,356 వద్ద స్థిరపడింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 42,059 వరకూ ఎగసింది. తద్వారా తొలిసారి 42,000

Most from this category