News


జీఎంఆర్‌ డీల్‌కు సీసీఐ ఆమోదం

Saturday 22nd February 2020
news_main1582342032.png-31995

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ ఏడీపీకి జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారంలో వాటాల విక్రయానికి సంబంధించిన డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌)లో 49 శాతం, జీఎంఆర్ ఇన్‌ఫ్రా సర్వీసెస్‌లో 100 శాతం వాటాల కొనుగోలుకు  గ్రీన్ చానల్ విధానంలో గ్రూప్ ఏడీపీ దరఖాస్తు చేసుకుందని సీసీఐ పేర్కొంది. ఈ విధానంలో వచ్చిన దరఖాస్తులన్నీ ఆమోదం పొందినవాటిగా పరిగణిస్తారు. ఈ డీల్ విలువ రూ. 10,780 కోట్లుగా ఉండనున్న సంగతి తెలిసిందే. 



You may be interested

విమానానికి వైరస్‌..!

Saturday 22nd February 2020

కోవిడ్-19 వైరస్‌ నష్టం 29 బిలియన్‌ డాలర్లు! అంతర్జాతీయంగా 4.7% తగ్గనున్న విమానయానం ఆసియా దేశాల్లో 13% క్షీణించనున్న డిమాండ్‌ అంచనాలను ప్రకటించిన ఐఏటీఏ  టోక్యో: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్‌–19(కరోనా) వైరస్‌.. ప్రత్యేకించి విమానయాన రంగంలోని కంపెనీల మానుగడనే ప్రశ్నార్థకంలో పడేస్తోంది. పూర్తి ఎకానమీ మాటను అటుంచితే, ఈ రంగంలోని అనేక కంపెనీలు రెక్కలు తెగిన పక్షిలా పడిపోయేంతటి పరిస్థితికి దారి తీస్తోంది. ఇంధన భారం, డిమాండ్‌కు మించి పెరిగిన

సీసీఐ విచారణ ఆదేశాలు కొట్టివేయండి

Saturday 22nd February 2020

కర్ణాటక హైకోర్టుకు ఫ్లిప్‌కార్ట్‌ న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తమపై విచారణ జరపాలంటూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ఈ-కామర్స్ సంస్థ ఫ్లి్ప్‌కార్ట్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) చేసిన ఆరోపణలే ప్రాతిపదికగా, ఎలాంటి ప్రాథమిక ఆధారాలేమీ లేకుండానే సీసీఐ తమపై దర్యాప్తుకు ఆదేశించిందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. వివరాల్లోకి వెడితే.. ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు .. భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలతో పోటీని

Most from this category