News


జీఎంఆర్‌ సంస్థల విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం

Saturday 27th July 2019
news_main1564202809.png-27351

హైదరాబాద్‌: జీఎంఆర్‌ గ్రూప్ సంస్థల విలీనం, విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనల ప్రకారం జీఎంఆర్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌లో జీఎంఆర్‌ హైదరాబాద్ ఎయిర్‌ కార్గో అండ్ లాజిస్టిక్స్‌ను విలీనం చేయనున్నారు. అలాగే, జీఎంఆర్‌ ఏరోటెక్నిక్‌కి చెందిన మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవరాలింగ్ (ఎంఆర్‌వో) వ్యాపార విభాగాన్ని జీఎంఆర్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌ సంస్థ కింద విడగొట్టనున్నారు. మూడు సంస్థల వాటాదారులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఈ చర్యలు దోహదపడగలవని జీఎంఆర్‌ గ్రూప్ పేర్కొంది. 



You may be interested

మరిన్ని విమానాశ్రయాల ప్రైవేటీకరణ

Saturday 27th July 2019

రెండో దశలో 20-25 ఎయిర్‌పోర్టులపై దృష్టి ఏఏఐ చైర్మన్ గురుప్రసాద్ వెల్లడి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరిన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించడంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించగా రెండో విడతలో మరో 20-25 ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించాలని భావిస్తోంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్ గురుప్రసాద్ మహాపాత్ర శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఏటా 15 లక్షల మంది పైగా విమాన ప్రయాణీకులు ఉండే ఈ

‘నిస్సాన్‌’ చెన్నై ప్లాంట్‌లో 1,700 ఉద్యోగాలకు కోత..!

Saturday 27th July 2019

మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగంలోనే అధికం న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ నిస్సాన్‌.. భారత్‌లోని తన చెన్నై ప్లాంట్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాలను తగ్గించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆరు వేలకు మించి ఉద్యోగులను తీసివేయనున్నట్లు కంపెనీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 6,100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు వెల్లడించింది. ఆరు ప్రధాన నగరాల్లో ఈ కోతలు ఉండనున్నట్లు పేర్కొంది. ఈ

Most from this category