News


క్రీట్‌ విమానాశ్రయం నిర్మాణం జీఎంఆర్‌ చేతికి

Tuesday 11th February 2020
news_main1581395919.png-31681

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌) గ్రీస్‌ క్రీట్‌లోని హెరాక్లియోన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్, ఆపరేషన్, నిర్వహణ బిడ్‌ను దక్కించుకుంది. దీంతో యూరోపియన్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్వహణ బిడ్‌ గెలిచిన తొలి భారతీయ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌గా జీఎంఆర్‌ నిలిచింది. జీఏఎల్, దాని గ్రీస్‌ భాగస్వామి జీఈకే టెర్నా కన్సార్టియం గతేడాది ఫిబ్రవరిలో కన్సెషన్‌ అగ్రిమెంట్‌ మీద సంతకాలు చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయ అభివృద్ధికి ఈ కన్సార్టియం 500 మిలియన్‌ యూరోలకు పైగా పెట్టుబడులు పెట్టనుంది. ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి గ్రీస్‌ ప్రధాన మంత్రి కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా జీఎంఆర్‌ గ్రూప్‌ ఎనర్జీ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాలా మాట్లాడుతూ.. హెరాక్లియోన్‌ విమానాశ్రయ బిడ్‌తో జీఎంఆర్‌ గ్రూప్‌ ఈయూ రీజియన్‌కు ఎంట్రీ ఇచ్చినట్లయిందన్నారు. ప్రతిష్టాత్మక ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్ట్‌ కన్సేషన్‌ పీరియడ్‌ 35 ఏళ్లు. ఈ ప్రాజెక్ట్‌కు స్థానిక గ్రీస్‌ ప్రభుత్వం ఈక్విటీ, ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్ట్స్‌ నుంచి నిధులను సమకూరుస్తుంది. హెరాక్లియోన్‌ గ్రీస్‌లోని రెండో అతిపెద్ద విమానాశ్రయం. గత మూడేళ్లుగా 10 శాతం ట్రాఫిక్‌ వృద్ధిని నమోదు చేస్తుంది. ప్రపంచంలోని ఉత్తమ పర్యాటక ప్రాంతాల్లో గ్రీస్‌ ఒకటి. ఏటా 33 మిలియన్ల మంది పర్యాటకులు వస్తుంటారు. క్రిట్‌ అత్యధిక పర్యాటకులను ఆకర్షించే ద్వీపం. 



You may be interested

రేటింగ్‌ ఏజెన్సీలకు పెనాల్టీ పెంచే యోచనలో సెబీ

Tuesday 11th February 2020

న్యూఢిల్లీ: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఎన్‌సీడీలకు రేటింగ్‌ల కేటాయింపులో లోపాలకు గాను రేటింగ్‌ ఏజెన్సీలకు పెనాల్టీలను పెంచే యోచనలో సెబీ ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2019 డిసెంబర్‌లో సెబీ.. ఇక్రా, కేర్‌ రేటింగ్స్‌, ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌లకు ఒక్కో సంస్థకు రూ.25 లక్షల చొప్పున జరిమానా విధించింది. కానీ, ఆ తర్వాత ఈ సంస్థలకు సంబంధించి తీవ్రమైన అభ్యంతరాలను సెబీ గుర్తించింది. రేటింగ్‌ ఏజెన్సీల వైఫల్యాల స్థాయిలో తాను విధించిన

స్వల్ప కాలానికి స్టాక్‌ రికమండేషన్స్‌!

Tuesday 11th February 2020

సాంకేతిక అంశాల ఆధారంగా సిఫారసులు 400 పాయింట్లు జంప్‌చేసిన సెన్సెక్స్‌ అమెరికా స్టాక్‌ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ 9.40కల్లా క్వాడ్రపుల్‌ సెంచరీ సాధించింది. 409 పాయింట్లు జంప్‌చేసి 41,389 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125 పాయింట్లు ఎగసి 12,155ను తాకింది. సోమవారం కరోనా భయాల నుంచి బయటపడిన అమెరికా స్టాక్‌

Most from this category