మాంద్యానికి చేరువగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ
By Sakshi

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి మాంద్యం బారిన చిక్కుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. మాంద్యానికి చేరువ అవుతోందని అభిప్రాయపడింది. భారత్ మాత్రం మాంద్యానికి దగ్గర్లో లేదని, మందగమనంలోనే ఉందని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు చాలా బలహీనత చూపిస్తున్నాయని, తదుపరి దశ ప్రపంచ వ్యాప్తంగా మాంద్యమేనని భావిస్తున్నట్టు మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఇప్పటి నుంచి వచ్చే తొమ్మిది నెలల కాలంలో ఇది చోటు చేసుకోవచ్చని పేర్కొంది. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా పయనించేందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఇతర విశ్వసనీయ సంకేతాల ద్వారానూ మాంద్యం వస్తున్నట్టు తెలుస్తోందంటూ... బాండ్ ఈల్డ్ కర్వ్‌ను ఉదహరించింది. ఈ బాండ్ ఈల్డ్ కుచించకుపోవడాన్ని పేర్కొంది. సాధారణంగా మాంద్యం ముందు ఇలానే జరుగుతుంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు కూడా ఇలానే జరిగింది. అంటే దీర్ఘకాలిక బాండ్ రాబడులను స్వల్పకాల బాండ్ ఈల్డ్స్ దాటిపోవడం ఇందులో జరుగుతుంది. ‘‘అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరింత ముదిరితే, చైనా నుంచి వచ్చే అన్ని దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు 25 శాతానికి చేరితే, మరో మూడు త్రైమాసికాల్లో ప్రపంచ ఆర్థిక రంగం మాంద్యంలోకి ప్రవేశించినట్టే’’అని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. అయితే భారత్ మాత్రం మాంద్యానికి సమీపంలో లేదని తెలిపింది. మందగమనం ఎదుర్కొంటోందని, ఆటోమొబైల్ పరిశ్రమ వంటి కొన్ని రంగాలు మాత్రం మాంద్యానికి చేరువ అవుతున్నాయని పేర్కొంది. భారత ఆర్థిక రంగం వరుసగా మూడు త్రైమాసికాల్లో తగ్గిపోవడం, వృద్ధి అంచనాలు కూడా తక్కువగానే ఉండడం గమనార్హం. పారిశ్రామికోత్పత్తి, మౌలిక రంగాలు కూడా గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటుండడం చూస్తున్నాం. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ, ఇతర యూరోప్ ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం ముప్పు ఎక్కువగా పొంచి ఉందని మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. బ్రెగ్జిట్ విషయంలో రాజకీయ అనిశ్చితి రెండో త్రైమాసికంలోనూ జీడీపీని క్షీణించేలా చేసిందని, మాంద్యం తప్పదన్న భయాలను ఇది కలిగిస్తోందని పేర్కొంది. భారత్‌కు మాంద్యం ముప్పు ఇప్పటికిప్పుడు లేకపోయినా, విధాన నిర్ణేతలు దీన్ని విస్మరించరని, సమస్యలు పెరిగిపోయే అవకాశం ఇవ్వరని అభిప్రాయపడింది.
You may be interested
రెండేళ్లలో రిలయన్స్ షేరు రెట్టింపు?
Monday 12th August 2019రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో ప్రకటించిన నిర్ణయాలు కంపెనీ భవిష్యత్తును ఆకర్షణీయంగా మార్చేవిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంగళవారం స్టాక్ ఐదు శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని, రెండేళ్లు ఓపిక పడితే ఈ స్టాక్ రెట్టింపు అవుతుందని పేర్కొంటున్నారు. ‘‘ఆర్ఐఎల్ 65 బిలియన్ డాలర్ల రుణంపై క్రెడిట్ సూసే ఆందోళన సరైనది కాదు. రూ.4 లక్షల కోట్ల నికర విలువ కలిగి ఉండడంతోపాటు, రిఫైనరీ, ఆయిల్ కెమికల్స్, రిటైల్, జియో వ్యాపారాలు
రిలయన్స్ హోమ్ పైనాన్స్‌లో వాటా విక్రయానికి రిలయన్స్ క్యాపిటల్ చర్చలు
Monday 12th August 2019రిలయన్స్ హోమ్స్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో తన మెజారిటీ వాటాను విక్రయించేందుకు రిలయన్స్ క్యాపిటల్ సిద్ధమైంది. ఈ మేరకు నాలుగు ప్రముఖ కంపెనీలతో చర్చలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వాటిలో వార్దే పాట్నర్స్ ఇంక్.., ఐయాన్ క్యాపిటల్, క్యాబెరీస్ క్యాపిటల్ మేనేజెంట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో పాటు ఎన్బీబీసీ కంపెనీ ఆల్టికో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ కంపెనీలున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ ప్రస్తుతం బుక్లోన్ విలువ రూ.11,000 కోట్లుగా ఉంది. వీటిలో