News


ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌లో జీఐసీ పెట్టుబడులు

Tuesday 24th December 2019
news_main1577160817.png-30400

  •  రూ.434 కోట్లు ఇన్వెస్ట్‌చేసిన సింగపూర్‌ వెల్త్‌ఫండ్‌ 

న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన రియల్టీ కంపెనీ ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌లో సింగపూర్‌కు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ జీఐసీ రూ.434 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నది. ఈ పెట్టుబడులకు గాను ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ కంపెనీ 1.34 కోట్ల ఈక్విటీ షేర్లను జీఐసీ అనుబంధ సంస్థ గామ్నాట్‌ పీటీఈ లిమిటెడ్‌కుకి జారీ చేయనున్నది. ఒక్కో షేర్‌ను రూ.323 ధరకు జారీ చేస్తామని, ఈ షేర్ల జారీకి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ వెల్లడించింది. ఈ షేర్ల జారీకి వాటాదారుల ఆమోదం తీసుకోవలసి ఉందని పేర్కొంది. 
236 రియల్టీ ప్రాజెక్ట్‌లు...
ప్రెస్టీజ్‌ ఎస్టేట్స్‌ కంపెనీ తన 32 ఏళ్ల చరిత్రలో మొత్తం 236 రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. 12.5 కోట్ల చదరపుటడుగుల స్పేస్‌ను డెవలప్‌ చేసింది. ఈ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా దక్షిణ భారత్‌లోనే ఉన్నాయి. ఈ కంపెనీ ఇటీవలనే నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌) రియల్టీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఏస్‌ గ్రూప్‌తో కలిసి నోయిడాలో తొలి హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ను రూ.500 కోట్ల పెట్టుబడులతో ఆరంభించనున్నది. ఇక ఏరో సిటీలో డీబీ గ్రూప్‌తో కలిసి రూ.2,000 కోట్లతో ఒక పెద్ద హోటల్‌ను డెవలప్‌ చేస్తోంది. 

ఇక సింగపూర్‌కు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ భారత రియల్టీ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ సంస్థ ఇటీవలనే డీఎల్‌ఎఫ్‌ రెంటల్‌ విభాగం డీఎఫ్‌ఎల్‌ సైబర్‌ సిటీ డెవలపర్స్‌లో 33 శాతం వాటా కోసం రూ.9,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది.  



You may be interested

టెల్కో లైసెన్స్‌ ఫీజుల తగ్గింపు!

Tuesday 24th December 2019

త్వరలో ప్రభుత్వ ప్రకటన టెలికం కంపెనీల లైసెన్సు ఫీజులను ప్రభుత్వం త్వరలో 8 నుంచి 6- 5 శాతానికి తగ్గించనుంది. టెలికం కంపెనీలకు ఊరట కలిగించే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ ఒకటి లైసెన్సుఫీజుల తగ్గింపుపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఫీజుల తగ్గింపుతో మూడు టెలికం కంపెనీలకు కలిపి దాదాపు రూ.4-5 వేల కోట్ల ప్రయోజనం చేకూరనుంది. అయితే ఇది

పర్యటనకు ఛలో హైదరాబాద్‌

Tuesday 24th December 2019

ఈ నగరానికి పెరుగుతున్న దేశీ పర్యాటకులు  బుకింగ్‌డాట్‌కామ్‌ సర్వే వెల్లడి  ముంబై: దేశీయ పర్యాటకులు ఈ ఏడాది హైదరాబాద్‌కు జై కొట్టారు. దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో హైదరాబాద్‌కే అగ్రతాంబూలం దక్కిందని బుకింగ్‌డాట్‌కామ్‌  సర్వేలో వెల్లడైంది. ఇక దేశీయ పర్యాటకుల అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాల్లో దుబాయ్‌ అగ్రస్థానంలో నిలిచిందని ఈ సర్వే పేర్కొంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్‌ 30 వరకూ పర్యాటక, వసతి పరంగా జరిగిన బుకింగ్స్‌ ఆధారంగా ఈ

Most from this category