News


జీఐసీ రీ లాభం 20 శాతం డౌన్‌

Friday 24th May 2019
news_main1558680413.png-25903

  • ఒక్కో షేర్‌కు రూ.6.75 డివిడెండ్‌

న్యూఢిల్లీ: జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (జీఐసీ రీ) నికర లాభం (స్డాండ్‌అలోన్‌) గత ఆర్థిక సంవత్సరం (2018-19) నాలుగో త్రైమాసిక కాలంలో 20 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) క్యూ4లో రూ.752 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.603 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. స్థూల ప్రీమియమ్‌ వసూళ్లు రూ.8,525 కోట్ల నుంచి రూ.8,089 కోట్లకు తగ్గాయని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.6.75 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.
ఇక ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.3,234 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 31 శాతం తగ్గి రూ.2,224 కోట్లకు చేరిందని జీఐసీ రీ తెలిపింది. పన్ను సంబంధిత చట్టాల్లో మార్పులు కారణంగా పన్ను కేటాయింపులు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని తెలిపింది. స్థూల ప్రీమియమ్‌ మాత్రం రూ.41,799 కోట్ల నుంచి రూ.44,238 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్‌ ఆదాయం రూ.5,391 కోట్ల నుంచి 19 శాతం ఎగసి రూ.6,401 కోట్లకు పెరిగిందని వివరించింది. 



You may be interested

ఆర్థిక​వృద్ధికి ఊతం

Friday 24th May 2019

స్థిరమైన ప్రభుత్వంతో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఎన్‌డీఏ 2.0తో సాహసోపేత సంస్కరణలు ఎన్నికల ఫలితాలపై పరిశ్రమ వర్గాల అంచనా న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక సారథ్యానికి ప్రజలు మరోసారి రికార్డు మెజారిటీతో పట్టం కట్టారని భారతీయ పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుతో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, విదేశీ పెట్టుబడుల రాకకు ఊతం లభించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశాయి. ఎకానమీని అధిక వృద్ధి బాట పట్టించేందుకు

1280 డాలర్ల వద్ద పసిడి

Friday 24th May 2019

డాలర్‌ ఇండెక్స్‌ 2ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1280 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1284 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్న రాత్రి విడుదల చేసిన తయారీ రంగ గణాంకాలు పదేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ఏప్రిల్‌లో హౌసింగ్‌ అమ్మకాల గణాంకాలు కూడా మార్కెట్‌ను నిరుత్సాహపరిచాయి. బలహీన ఆర్థిక గణాంకాల విడుదలైన నేపథ్యంలో

Most from this category