News


జెనీవా ఆటో షో రద్ధు

Saturday 29th February 2020
news_main1582947366.png-32171

కోవిడ్-19 వైరస్(కరోనా) నేపథ్యంలో ఎగ్జిబిషన్ల వంటి కార్యక్రమాలను నిషేధించినట్లు స్విస్ ప్రభుత్వం శుక్రవారం నిషేధాన్ని ప్రకటించింది. ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు 1,000 మందికి మించిన జనసమూహాలు ఉండ కూడదని వెల్లడించింది. దీంతో ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు జరగాల్సిన జెనీవా ఆటో షో రద్దు అయ్యింది. ఇప్పటికే 15 కేసులను గుర్తించిన స్విస్‌ ప్రభుత్వం.. ఈ మహమ్మారి వ్యాప్తి జరగకుండా ఉండడం కోసం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, ఈ క్రమంలోనే ఆటో షో రద్దు అయ్యిందని స్విట్జర్లాండ్ మంత్రి అలైన్ బెర్సెట్ ప్రకటించారు. 



You may be interested

స్థిరత్వం శుభ సంకేతం!

Saturday 29th February 2020

వృద్ధి తీరుపై ఆర్థికమంత్రి భారత్‌ ఆర్థిక వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదుకావడాన్ని ఆర్థిక రంగంలో ‘‘స్థిరత్వం’’గా ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థికవ్యవస్థకు ఇది ఒక శుభ సంకేతమనీ విశ్లేషించారు.  సీఎన్‌బీసీ టీవీ 18 బిజినెస్‌ లీడర్‌షిప్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి  ఈ సందర్భంగా మాట్లాడుతూ,  వృద్ధి రేటు మరికొంతకాలం ఇదే స్థాయిలో స్థిరంగా ఉండే వీలుందని పేర్కొన్నారు. కోవిడ్‌-19 గురించి అడిగిన ఒక ప్రశ్నకు

ఏడేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి

Saturday 29th February 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదు అంతక్రితం త్రైమాసికంలో 4.5 శాతం తాజాగా 5.1 శాతానికి సవరణ పరుగులు తీస్తున్న ద్రవ్యలోటు బడ్జెట్‌ అంచనాలను దాటి 121 శాతానికి న్యూఢిల్లీ: ఇంటా, బయటా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో, దేశ జీడీపీ వృద్ధి రేటు డిసెంబర్‌ త్రైమాసికంలో ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. 4.7 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) జూలై-సెప్టెంబర్‌ కాలంలో వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 4.5 శాతం నుంచి 5.1 శాతానికి

Most from this category