News


25 శాతం తగ్గిన గెయిల్‌ నికర లాభం

Tuesday 11th February 2020
news_main1581390668.png-31671

న్యూఢిల్లీ: గెయిల్‌ నికర లాభం డిసెంబర్‌ క్వార్టర్‌లో 25 శాతం తగ్గింది. సహజ వాయువు, ఎల్‌పీజీ, లిక్విడ్‌ హైడ్రోకార్బన్ల మార్కెటింగ్‌ మార్జిన్లు క్షీణించడంతో రూ.1,250 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. షేరు వారీ ఆర్జన రూ.2.77గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నికర లాభం రూ.1,681 కోట్లుగా ఉండడం గమనార్హం. సహజ వాయువు మార్కెటింగ్‌ ద్వారా వచ్చే ఆదాయం 9.5 శాతం తగ్గి రూ.14,663 కోట్లుగా ఉంది. ఈ విభాగం లాభం 31 శాతం తగ్గి రూ.466 కోట్లుగా నమోదైంది. గ్యాస్‌ పంపిణీ విభాగంలో ఆదాయం, లాభాలు డబుల్‌డిజిట్‌ స్థాయిలో వృద్ధి చెందాయి. పెట్రో కెమికల్‌ వ్యాపారం రూ.8.51 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం ‍క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.19,789 కోట్ల నుంచి రూ.17,769 కోట్లకు పరిమితమైంది. త్రైమాసికం వారీగా చూస్తే సెప్టెంబర్‌ క్వార్టర్‌లో వచ్చిన నికర లాభం కంటే డిసెంబర్‌ త్రైమాసికంలో లాభం 18 శాతం పెరిగినట్టు గెయిల్‌ తెలిపింది. ఒక్కో షేరుకు గాను రూ.6.40 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చేందుకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 



You may be interested

ప్రభుత్వ బ్యాంకింగ్‌పై తగ్గుతున్న ‘మొండి’ భారం

Tuesday 11th February 2020

లోక్‌సభలో ఆర్థికమంత్రి ప్రకటన 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు 2019 సెప్టెంబర్‌లో రూ.7.27 లక్షల కోట్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులపై మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం తగ్గుతోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 మార్చిలో రూ.8.96 లక్షల కోట్లు ఉన్న ఈ మొండిబకాయిల భారం 2019 సెప్టెంబర్‌ నాటికి రూ.7.27 లక్షల కోట్లకు తగ్గిందని తెలిపారు. దేశంలో బ్యాంకింగ్‌ రంగ మెరుగుదలకు

ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఎన్‌టీపీసీ హ్యాపీ

Tuesday 11th February 2020

2018-19లో లాభదాయక కంపెనీలు ఇవి... పార్లమెంటులో సర్వే న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 2018-19లో లాభాల బాటన నిలిచిన కంపెనీల్లో తొలి మూడు స్థానాల్లో ఓఎన్‌జీసీ, ఇండియన్‌ ఆయన్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీలు ఉన్నాయి. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా, ఎంటీఎన్‌ఎల్‌లు భారీ నష్టాలను మూటగట్టుకున్న ప్రభుత్వ రంగ కంపెనీలుగా మిగిలాయి. వరుసగా మూడేళ్ల నుంచీ ఈ కంపెనీలది ఇదే పరిస్థితి. 2018-19కి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి పార్లమెంటులో

Most from this category