News


గెయిల్‌ చరిత్రాత్మక లాభం

Tuesday 28th May 2019
news_main1559028346.png-25955

  • ఒక షేరుకు మరో షేరు బోనస్‌
  • రూ.1.75 చొప్పున తుది డివిడెండ్‌
  • విస్తరణపై రూ.54,000 కోట్ల వ్యయ ప్రణాళిక

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్‌ మార్చి త్రైమాసికంలో రూ.1,122 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న లాభంతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ఆదాయం సైతం రూ.15,430 కోట్ల నుంచి రూ.18,764కోట్లకు వృద్ధి చెందింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.74,808 కోట్ల ఆదాయం (39 శాతం అధికం)పై రూ.6,026 కోట్ల లాభాన్ని (30 శాతం వృద్ధి) నమోదు చేసింది. వాటాదారుల వద్దనున్న ప్రతీ షేరుకు మరొక షేరును బోనస్‌గా ఇవ్వాలని, అలాగే, ప్రతీ షేరుకు రూ.1.77చొప్పున తుది డివిడెండ్‌ ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది. 2018-19లో రికార్డు స్థాయిలో ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో రూ.8,344 కోట్లను విస్తరణపై ఖర్చు చేశామని, వచ్చే 2-3 ఏళ్లలో మరో రూ.54,000 కోట్లను గ్యాస్‌ పైపులైన్ల ఏర్పాటుపై ఖర్చు చేయనున్నట్టు గెయిల్‌ చైర్మన్‌, ఎండీ బీసీ త్రిపాఠి తెలిపారు. గెయిల్‌కు దేశవ్యాప్తంగా 14,000 కిలోమీటర్ల పొడవు పైపులైన్‌ మార్గాలు ఉన్నాయి. కొత్తగా రూ.32,000 కోట్లతో 6,000 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తోంది. దీంతో తూర్పు, దక్షిణ భారత్‌లో అనుసంధానం లేని ప్రాంతాలకు చేరుకోగలదు. అలాగే, వారణాసి, పాట్నా పట్టణాలకు పైపు ఆధారిత సహజవాయువు సరఫరా చేసేందుకు గాను రూ.12,000 కోట్లతో పంపిణీ నెట్‌వర్క్‌ను కూడా నిర్మిస్తోంది. మరో రూ.10,000 కోట్లను పెట్రోకెమికల్స్‌ వ్యాపారం విస్తరణపై వెచ్చించనుంది. పెట్రోకెమికల్‌ విభాగంలో రూ.20 కోట్ల నష్టాలను గెయిల్‌ మార్చి త్రైమాసికంలో ఎదుర్కొన్నది. యూఎస్‌ షేల్‌ గ్యాస్‌ వెంచర్‌, దబోల్‌ పవర్‌ ప్లాంట్‌ రూపంలో రూ.326 కోట్ల​ఏకీకృత పెట్టుబడి విలువ క్షీణతను ఎదుర్కొ‍న్నట్టు త్రిపాఠి తెలిపారు.You may be interested

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 5 శాతం జంప్‌

Tuesday 28th May 2019

క్యూ4లో ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 5 శాతం మేర పెరిగింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ ఆదాయం 17.8 శాతం పెరుగుదలతో రూ. 7,933 కోట్లకు చేరగా, నికరలాభం 26.8 శాతం పెరిగి రూ. 292 కోట్లకు చేరినట్లు జీ తెలిపింది. దీంతో మధ్యాహ్నం 1 గంట సమయానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు 5 శాతం పెరిగి రూ. 378 వద్ద ఇంట్రాడే

ఇండిగో లాభం ఐదింతలు

Tuesday 28th May 2019

రూ.589 కోట్ల ఆర్జన న్యూఢిల్లీ: ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ లాభం మార్చి త్రైమాసికంలో ఐదు రెట్లు పెరిగి రూ.589 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.117 కోట్లుగానే ఉంది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,097 కోట్లతో పోలిస్తే, 35 శాతం వృద్ధి తో రూ.8,260 కోట్లుగా నమోదైంది. ఇక 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఇండిగో లాభం అతి తక్కువగా

Most from this category