News


గెయిల్‌ ఇండియా టర్నోవర్‌ రూ.18,010 కోట్లు

Saturday 9th November 2019
news_main1573270527.png-29467

  • 35 శాతం తగ్గిన నికర లాభం 
  • తగ్గిన మార్జిన్లు, ధరల ప్రభావం 

న్యూఢిల్లీ:- ప్రభుత్వ రంగ గెయిల్‌ ఇండియా కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 35 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,789 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,168 కోట్లకు తగ్గిందని గెయిల్‌ ఇండియా తెలిపింది. నేచురల్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌ మార్జిన్లు తగ్గడం, పెట్రో కెమికల్‌ వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఈ క్యూ2లో రూ.18,010 కోట్ల టర్నోవర్‌ సాధించామని పేర్కొంది. 

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం...
నేచురల్‌ గ్యాస్‌ పంపిణి వ్యాపార విభాగం స్థూల లాభం 10 శాతం తగ్గి రూ.803 కోట్లకు తగ్గింది. పెట్రో కెమికల్‌ వ్యాపారంలో రూ.82 కోట్ల నష్టాలు వచ్చాయి. నేచురల్‌ గ్యాస్‌ మార్కెటింగ్‌ వ్యాపారం స్థూల లాభం 70 శాతం తగ్గి రూ.242 కోట్లకు చేరింది. ఎల్పీజీ, లిక్విఫైడ్‌ హైడ్రోకార్బన్‌ వ్యాపారం 68 శాతం తగ్గి రూ.245 కోట్లకు తగ్గింది. పెట్రో రసాయనాల మార్కెట్‌ ధర 8 శాతం, లిక్విడ్‌ హైడ్రోకార్బన్‌ల మార్కెట్‌ ధర 25 శాతం చొప్పున తగ్గాయి. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్‌ ధరలు కూడా తగ్గాయి. ఫలితంగా నికర లాభం బాగా తగ్గింది. 

ఆరు నెలల లాభం 17 శాతం డౌన్‌....
ఇక ఆరు నెలల పరంగా చూస్తే, నికర లాభం 17 శాతం తగ్గి రూ.2,671 కోట్లకు చేరింది. టర్నోవర్‌లో పెద్దగా మార్పు లేకుండా రూ.36,731 కోట్లకు చేరింది. 

 



You may be interested

మహీంద్రాకు మందగమనం సెగ

Saturday 9th November 2019

78 శాతం తగ్గిన నికర లాభం  21 శాతం పడిపోయిన అమ్మకాలు  స్వల్పంగా మెరుగుపడిన మార్జిన్లు  ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసిక కాలంలో 78 శాతం తగ్గి రూ.368 కోట్లకు చేరింది. అమ్మకాలు బాగా పడిపోవడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. ఆదాయం 6 శాతం తగ్గి రూ.23,936 కోట్లకు తగ్గిందని పేర్కొంది. మార్కెట్‌ అంచనాలకు

స్నేహపూర్వక పన్ను వ్యవస్థను సృష్టించాలి

Saturday 9th November 2019

పన్నుల శాఖ అధికారులకు ఆర్థికమంత్రి సూచన ఫరీదాబాద్‌: స్నేహ పూర్వక పన్ను వ్యవస్థ ఏర్పాటు బాటన సాగాలని పన్నుల శాఖ అధికారులకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. ప్రభుత్వానికి-పన్ను చెల్లింపుదారులకు మధ్య అనుసంధానకర్తలుగా తగిన సౌలభ్యత రూపకర్తలుగా వ్యవహరించాలని రెవెన్యూ ఇంటెలిజన్స్‌ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లింపులకు సంబంధించి చెల్లింపుదారులు ఏ అంశంలోనూ భయాందోళనలకు గురికాని పరిస్థితి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఇక్కడి నేషనల్‌ అకాడమీలో జరిగిన ఇండియన్‌ రెవెన్యూ

Most from this category