News


గెయిల్‌ రూ.1.05 లక్షల కోట్ల పెట్టుబడులు

Tuesday 25th February 2020
news_main1582599702.png-32058

  • విస్తరణ పనుల కోసం 
  • వెల్లడించిన కొత్త సీఎమ్‌డీ 

న్యూఢిల్లీ: గెయిల్‌ ఇండియా కంపెనీ విస్తరణ కార్యకలాపాల నిమిత్తం ఐదేళ్లలో రూ.1.05 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. గ్యాస్‌ పైప్‌లైన్ల విస్తరణ, నగరాల్లో గ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్‌ ఏర్పాటు,  పెట్రో రసాయనాల ఉత్పత్తి సామర్థ్యం పెంపు... వీటి కోసం ఈ పెట్టుబడులు పెట్టనున్నామని గెయిల్‌కు సీఎమ్‌డీగా నియమితులైన మనోజ్‌ జైన్‌ పేర్కొన్నారు. గ్యాస్‌ పైప్‌లైన్ల విస్తరణ కోసం రూ.45,000-50,000 కోట్లు పెట్టుబడులు పెడతామని తెలిపారు. సీటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌(సీజీడీ) వ్యాపారం కోసం రూ.50,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తామని చెప్పారు. అలాగే పెట్రో రసాయనాల ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం రూ.10,000 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని వివరించారు. 
భారత ఇంధన వినియోగం ప్రస్తుతం నేచురల్‌ గ్యాస్‌ వాటా 6.2 శాతంగా ఉందని జైన్‌ పేర్కొన్నారు. 2030 కల్లా దీనిని 15 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఈ లక్ష్యానికనుగుణంగానే పెట్టుబడులు పెడుతున్నామని పేర్కొన్నారు. 



You may be interested

నగదు రాజు అయితే.. డిజిటల్‌ దైవం

Tuesday 25th February 2020

ఆర్‌బీఐ సరికొత్త నినాదం ముంబై: నగదు రాజు అయితే డిజిటల్‌ కరెన్సీ దైవంగా ఆర్‌బీఐ పేర్కొంటోంది. డీమోనిటైజేషన్‌ తర్వాత వ్యవస్థలో రూ.3.5 లక్షల కోట్ల మేర నగదు వినియోగం తగ్గిందన్న ఆర్‌బీఐ, డిజిటల్‌ చెల్లింపులను గొప్ప అనుభవంగా మార్చడమే తన ప్రయత్నమని తెలిపింది. వ్యవస్థలో నగదు చెల్లింపులకు సంబంధించి కచ్చితమైన కొలమానాలు లేవని, డిజిటల్‌ చెల్లింపుల ప్రగతిని మాత్రం కచ్చితంగా లెక్కించొచ్చని పేర్కొంది. గత ఐదేళ్లలో డిజిటల్‌ చెల్లింపులు సంఖ్యా పరంగా

రూపాయి.. మూడు నెలల కనిష్టం!

Tuesday 25th February 2020

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో సోమవారం డాలర్‌ మారకంలో రూపాయి విలువ 34 పైసలు పడిపోయింది. 71.98 వద్ద ముగిసింది. గడచిన మూడు నెలల్లో ఈ స్థాయికి (నవంబర్‌ 13 తర్వాత) రూపాయి విలువ పడిపోవడం ఇదే తొలిసారి. దేశీయ ఈక్విటీల భారీ పతనం, విదేశీ మార్కెట్లలో అమెరికా కరెన్సీకి డిమాండ్‌ వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణంగా ఉన్నాయి. 71.94 వద్ద ప్రారంభమైన రూపాయి ఒకదశలో 72.01ని కూడా

Most from this category