News


కియా కార్ల ఉత్పత్తిలో నాణ్యతకు ప్రాధాన్యం

Wednesday 28th August 2019
news_main1566966636.png-28063

  • కియా మోటార్స్‌ ఇండియా ఎండీ కుకుయున్‌షిమ్‌

పెనుకొండ: కియా కార్ల ఉత్పత్తిలో నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని కియా మోటార్స్‌ ఇండియా ఎండీ, సీఈఓ కుకుయున్‌షిమ్‌ తెలిపారు. సెల్టోస్‌ విక్రయాలు ప్రారంభమైన నేపథ్యంలో మంగళవారం కియా యాజమాన్యం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కుకుయున్‌షిమ్‌ మాట్లాడుతూ... 2017లో కియా కార్ల ప్లాంట్‌ నిర్మాణాన్ని 530.5 ఎకరాల్లో ప్రారంభించగా.. ఇంజనీరింగ్‌ టీం సమర్థతతో ఎక్కడా జాప్యం లేకుండా పూర్తయినట్టు తెలిపారు. ఏటా 3 లక్షల కార్ల ఉత్తత్తి లక్ష్యంగా పరిశ్రమను స్థాపించామన్నారు. 70 సంవత్సరాలుగా 180 దేశాల్లో కియా కార్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. దేశంలోని గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి తనిఖీ కేంద్రాలు నెలకొల్పామన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా 960 మందికి శిక్షణనిచ్చామని.. కియాతో పాటు అనుబంధ సంస్థల్లో 11,950 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నట్టు వెల్లడించారు. కంపెనీ తరపున అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ క్రీడలకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కియా కార్ల పరిశ్రమ దేశంలోనే ఎనిమిదో అతిపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీగా గుర్తింపు పొందిందన్నారు.  కియా కార్ల పరిశ్రమతో పెనుకొండ ప్రాంతం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 



You may be interested

ఉద్దీపనలు బాగున్నా... వృద్ధి అంతంతే!

Wednesday 28th August 2019

పలు విశ్లేషణా, రేటింగ్‌ సంస్థల అంచనా దేశీయ, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు ఆగస్టు 31న ఏప్రిల్‌-జూన్‌  త్రైమాసిక జీడీపీ గణాంకాల వెల్లడి నేపథ్యం భారత్‌ ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రస్తుతం తీవ్రంగా ఉన్నాయని పలు విశ్లేషణా, రేటింగ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. ఇటు దేశీయ అటు అంతర్జాతీయ ప్రతికూలతలు దీనికి కారణమన్నది ప్రధాన విశ్లేషణ. ఈ నెలాఖరున ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అధికారిక గణాంకాలు వెల్లడవుతుండడం దీనికి నేపథ్యం. ముఖ్యాంశాలను పరిశీలిస్తే... వృద్ధి 6.4

71.52 వద్ద రూపీ ప్రారంభం

Wednesday 28th August 2019

యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ ఆందోళనలు, ఒత్తిడిలో ఉన్న యుఎస్‌ ఆర్ధిక వ్యవస్థ వలన బుధవారం డాలర్‌ బలహీనంగా ఉంది. అంతేకాకుండా దేశియ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ఉండడంతో రూపీ డాలర్‌ మారంకంలో 50 పైసలు బలపడి బుధవారం ట్రేడింగ్‌లో 71.52 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకం‍లో 72.02 వద్ద ముగిసింది. కాగా ఆరు మేజర్‌ కరెన్సీలున్న బాస్కెట్‌తో పోల్చుకుంటే డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా తగ్గి 98.013 వద్ద

Most from this category