News


వొడాఫోన్‌ ఐడియా బాండ్స్‌తో ఎంఎఫ్‌లకు చిక్కులు!?

Friday 15th November 2019
news_main1573794045.png-29613

వెన్నాడుతున్న డౌన్‌గ్రేడ్‌ భయాలు

వొడాఫోన్‌ ఐడియా గతంలో జారీ చేసిన బాండ్స్‌ కొనుగోలు చేసిన డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్నాయి. కంపెనీ విత్త పరిస్థితి బాగా దెబ్బతినడం, సాయం అందించేందుకు మాతృసంస్థలు విముఖత చూపడం తదితర కారణాలతో అసలు కంపెనీ మనుగడపైనే నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రభుత్వ సాయం అందకపోతే కంపెనీ దివాలాకు సిద్ధమన్నట్లుగా ఉంది. దీంతో ఈ కంపెనీ సెక్యూరిటీలు హోల్డ్‌ చేస్తున్న ఎంఎఫ్‌లు ఎటూపాలు పోని స్థితిలో ఉన్నాయి. తాజా పరిస్థితులు కంపెనీ బాండ్స్‌ డౌన్‌గ్రేడింగ్‌కు దారి తీస్తే అది ఆయా ఎంఎఫ్‌ స్కీముల విలువపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతానికి వొడా బాండ్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ రేటింగ్‌ కొనసాగుతోంది. సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడే వీటి నుంచి వైదొలగి వేరే సాధనాల వైపు చూడాలని ఎంఎఫ్‌లు భావిస్తున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్లకు ఫైనాన్షియల్‌ ప్లానర్స్‌ ఇదే సలహా ఇస్తున్నారు. వొడా బాండ్స్‌లో 5 శాతానికి మించి ఎక్స్‌పోజర్‌ ఉన్న స్కీముల నుంచి వైదొలగమని సూచిస్తున్నారు.

డేటా పరిశీలిస్తే దాదాపు 35 ఎంఎఫ్‌ స్కీములు వొడా బాండ్స్‌ కలిగిఉన్నాయి. వీటి పెట్టుబడుల విలువ దాదాపు రూ. 3400 కోట్లుంటుంది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, ఆదిత్య బిర్లా, సన్‌లైఫ్‌, యూటీఐ, నిప్పన్‌ఫండ్స్‌ వద్ద కంపెనీ డెట్‌ బాండ్స్‌ ఉన్నాయి. వొడా పరిస్థితేమీ బాగాలేదని, ప్రమోటర్లు నిధులు ఇవ్వకపోతే అసలు కంపెనీ ఎలా నడుస్తుందని దేశీయ ఫండ్‌కు చెందిన సీఐఓ ప్రశ్నించారు. ఒకవేళ ఈ బాండ్స్‌ రేటింగ్‌ బీబీబీ దిగువకు వస్తే అప్పుడు ఎంఎఫ్‌లు వీటిని మార్క్‌డౌన్‌ చేయకతప్పదు. ఇవన్నీ ఎందుకని ఇప్పటికే కొన్ని ఫండ్‌ హౌజ్‌లు భారీ డిస్కౌంట్‌తో వీటిని వదిలించుకున్నాయి. ప్రభుత్వ సాయం అందేది లేనిది తేలిపోతే వొడాఫోన్‌ ఐడియా భవితవ్యంపై స్పష్టత రానుంది. You may be interested

పెరిగి..పడిన పసిడి

Friday 15th November 2019

క్రితం రాత్రి అమెరికా మార్కెట్లో 10డాలర్లు లాభపడిన పసిడి ఫ్యూచర్లలో నేటి ఉదయం లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఫలితంగా ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 7.05 డాలర్లు నష్టపోయి 1,466.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిన్నరాత్రి  అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలతో పసిడి ధర 10డాలర్లు పెరిగి 1,473  డాలర్ల వద్ద స్థిరపడింది. ఇక నేడు ఆసియాలో ఔన్స్‌

రూ. 500 పైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Friday 15th November 2019

కార్పోరేట్‌ పన్ను రేటును ప్రభుత్వం తగ్గించిన తర్వాత నుంచి దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేయడం ప్రారంభించాయి. దీనికితోడు సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలు కూడా మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగా ఉండడంతో ఈక్విటీ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ జీవిత కాల గరిష్ఠానికి చేరువలో ఉంది. ఈ ఇండెక్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తు కదులుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు శుక్రవారం

Most from this category