News


తగ్గనున్న నెఫ్ట్‌ చార్జీలు ..

Monday 1st July 2019
news_main1561958736.png-26706

  • ఆర్‌బీఐ ఆదేశాలతో నేటి నుంచే అమల్లోకి

ముంబై: ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ విధానాల ద్వారా నగదు బదిలీ లావాదేవీల చార్జీలు నేటి నుంచి (సోమవారం) తగ్గనున్నాయి. ఈ తరహా లావాదేవీలపై తాను విధించే చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఇచ్చిన ఆదేశాలు జులై 1 నుంచి (నేడు) అమల్లోకి రావడం ఇందుకు కారణం. ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా ఈ లావాదేవీల చార్జీలను తగ్గించాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్‌ జులై 1 నుంచి ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు, నెఫ్ట్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ విధించే ప్రాసెసింగ్‌ చార్జీలను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. రూ. 2 లక్షల దాకా నగదు బదిలీ లావాదేవీలకు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌), అంతకు మించిన మొత్తానికి రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. 
    సాధారణంగా రిజర్వ్ బ్యాంక్‌ తన ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ సిస్టమ్‌ ద్వారా జరిగే లావాదేవీలపై బ్యాంకుల నుంచి కనీస చార్జీలను వసూలు చేస్తోంది. తదనుగుణంగా బ్యాంకులు కూడా కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నెఫ్ట్‌ లావాదేవీలపై రూ. 1 నుంచి రూ. 5 దాకా, ఆర్‌టీజీఎస్‌పై రూ. 5 నుంచి 50 దాకా చార్జీలు విధిస్తోంది. అయితే, డిజిటల్‌ చెల్లింపులను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్‌బీఐ తాను విధించే కనీస చార్జీలను ఎత్తివేయాలని నిర్ణయించడంతో ఆ మేరకు బ్యాంకులు వసూలు చేసే చార్జీలు కూడా తగ్గుతాయి. మరోవైపు ఏటీఎంల వాడకంపై బ్యాంకులు వడ్డిస్తున్న చార్జీలు, ఫీజులను కూడా సవరించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ అత్యున్నత స్థాయి కమిటీ వేసింది. 



You may be interested

క్రెడిట్‌ కార్డు రద్దు చేస్తున్నారా?

Monday 1st July 2019

రద్దు పక్కాగా జరగాలి బకాయిలన్నీ తీర్చిన తర్వాత రద్దుకు దరఖాస్తు తీర్చలేకపోతే వేరే కార్డుకు బదలాయింపు వ్యక్తిగత రుణం తీసుకుని అయినా చెల్లింపు రద్దు చేసుకుంటే క్రెడిట్‌ రేషియో పెరగొచ్చు ఇది క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం చూపించే అవకాశం లాభ, నష్టాలన్నీ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం క్రెడిట్‌ కార్డు స్వేచ్ఛగా ఖర్చు చేసేందుకు, రివార్డులు పొందేందుకు, మంచి క్రెడిట్‌ స్కోరు సాధించేందుకు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలకు ఉపయోగపడే సాధనం. అందుకే వేతన జీవుల్లో ఎక్కువ మంది క్రెడిట్‌ కార్డుపై మక్కువ

ఐటీ మినహాయింపు పరిమితి పెంపు!

Monday 1st July 2019

- రూ.10 కోట్ల ఆదాయం మించితే 40 శాతం పన్ను... - బడ్జెట్‌లో ఈ దిశగా చర్యలు ఉండొచ్చని కేపీఎంజీ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్‌లో మోదీ సర్కారు ఆదాయపు పన్ను(ఐటీ) విషయంలో కీలక చర్యలను ప్రకటించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నిర్వహించిన సర్వేలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులకు ఇప్పటివరకూ రూ.2.5 లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని పెంచొచ్చని పేర్కొన్నారు. ఈ నెల 5న

Most from this category