News


67 శాతం తగ్గిన ఎన్‌సీడీ నిధులు

Thursday 19th September 2019
news_main1568863896.png-28415

  • పెరిగిన డిఫాల్ట్‌లు
  • తగ్గిన ఇన్వెస్టర్ల విశ్వాసం 

న్యూఢిల్లీ:- నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల(ఎన్‌సీడీ)ల ద్వారా కంపెనీల నిధుల సమీకరణ ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో 67 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఆగస్టు కాలానికి ఎన్‌సీడీల ద్వారా కంపెనీలు రూ.21,048 కోట్లు సమీకరించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఎన్‌సీడీల ద్వారా నిధుల సమీకరణ రూ.7,000 కోట్లకు తగ్గిందని సెబీ వెల్లడించింది. వివిధ కంపెనీలు చెల్లింపుల్లో విఫలం కావడం, వివిధ కంపెనీల రేటింగ్‌ తగ్గడం, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఎస్సెల్‌ గ్రూప్‌ సంక్షోభాలు, తదితర కారణాల వల్ల ఎన్‌సీడీలపై ఇన్వెస్టర్లకు విశ్వాసం తగ్గిందని నిపుణులంటున్నారు.  పెరిగిన ఇష్యూలు...
ఎన్‌సీడీల ద్వారా నిధుల సమీకరణ తగ్గింది. అయితే ఇష్యూల విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం మెరుగ్గా ఉంది. గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల కాలంలో 6 ఎన్‌సీడీ ఇష్యూలు రాగా, ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి 14 ఎన్‌సీడీల ఇష్యూలు వచ్చాయి. బ్యాంక్‌లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు(ఎన్‌బీఎఫ్‌సీ)ల నుంచి రుణాలు లభించడం దుర్లభం కావడంతో పలు కంపెనీలు ఎన్‌సీడీ బాట పడుతున్నాయి. 
టాటా క్యాపిటల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ ఎన్‌సీడీల ద్వారా రూ.2,158 కోట్లు సమీకరించింది. ఎన్‌సీడీల ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు రెట్లు అదనంగా సమీకరించగలిగింది. ఇక ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ కంపెనీ తన లక్ష్యానికి రెట్టింపు, రూ.1,000 కోట్లు సమీకరించగలిగింది. 

ఈ రెండు కంపెనీలతో పాటు ముధూట్‌ మినీ ఫైనాన్షియర్‌, శ్రీరామ్‌ సిటీ యూనియన్‌ ఫైనాన్స్‌, మాగ్మా ఫిన్‌కార్ప్‌, కొసమట్టమ్‌ ఫైనాన్స్‌, ముత్తూట్‌ హోమ్‌ ఫిన్‌(ఇండియా), శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌ ప్రొడక్ట్‌, ఈసీఎల్‌ ఫైనాన్స్‌, ముథూట​ ఫైనాన్స్‌, ఇండియాబుల్స్‌ కన్సూమర్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు ఎన్‌సీడీల ద్వారా నిధులు సమీకరించాయి. 
ఎన్‌సీడీ నిధుల వినియోగం...
ఎన్‌సీడీల ద్వారా సమీకరించిన నిధులను కంపెనీలు విస్తరణ ప్రణాళికలకు, రుణ భారం తగ్గించుకోవడానికి, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తాయి. షేర్లుగా మారని రుణ సహిత బాండ్లుగా ఎన్‌సీడీలను చెప్పుకోవచ్చు. షేర్లుగా మారే డిబెంచర్ల కంటే కూడా ఎన్‌సీడీలకు అధిక వడ్డీ రేటును కంపెనీలు చెల్లిస్తాయి. 



You may be interested

టీవీ ధరలు దిగివస్తాయ్‌

Thursday 19th September 2019

3-4 శాతం వరకు తగ్గే అవకాశం ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానెళ్లపై దిగుమతి సుంకం ఎత్తివేత కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ దీంతో దేశీయంగా పెరగనున్న తయారీ న్యూఢిల్లీ: దేశీయంగా టీవీల తయారీని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఓపెన్‌ సెల్‌ టీవీ ప్యానళ్లపై 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది. దీంతో వీటి దిగుమతుల ఆధారంగా దేశీయంగా తయారీ మరింత పెరుగుతుందని కేంద్రం అంచనా. దిగుమతి సుంకం రద్దుతో టీవీ

బ్యాంకు మోసాలపై సీవీసీ సలహాబోర్డు ఏర్పాటు

Thursday 19th September 2019

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో రూ.50 కోట్లకు పైన మోసాల కేసులను పరిశీలించి చర్యలను సూచించేందుకు గాను మాజీ సీవీసీ టీఎం భాసిన్‌ అధ్యక్షతన ఓ సలహా మండలి (అడ్వైజరీ బోర్డు)ని ఏర్పాటు చేస్తూ కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో నిజాయితీ నిర్ణయాల విషయంలో బ్యాంకులకు విచారణ వేధింపుల నుంచి రక్షణకు ఉంటుంది. నిజాయితీ నిర్ణయాలకు రక్షణ ఉండాలన్న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌

Most from this category