News


ఫుడ్‌ ప్యాకెట్లపై ‘రెడ్‌ సిగ్నల్‌’

Friday 28th June 2019
news_main1561709341.png-26654

  • అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉంటే ఎర్ర కోడ్‌
  •  కొత్త లేబులింగ్‌, డిస్‌ప్లే నిబంధనలు అమల్లోకి
  • ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాలు

న్యూఢిల్లీ: మీరు ప్యాకేజ్డ్‌ ఆహార ఉత్పత్తులు తింటారా? ఒకవేళ వాటి ముందు భాగంలోనే ఎర్ర రంగు కోడ్‌ కనిపించిందనుకోండి!! అందులో అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర పరిమాణాలున్నాయని భావించాల్సిందే!!. ఎందుకంటే ఆహార భద్రత, ప్రమాణాల విభాగం (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) తాజాగా నూతన లేబులింగ్‌, డిస్‌ప్లే నిబంధనలను ప్రతిపాదించింది. వీటి ప్రకారం అధిక పరిమాణంలో ఫ్యాట్‌, చక్కెర, ఉప్పు ఉంటే ఆయా ఫుడ్‌ ప్యాకెట్లపై ఎర్ర రంగు కోడింగ్‌ ముంద్రించాల్సి ఉంటుంది. ఆహార భద్రత, ప్రమాణాల (ప్యాకేజింగ్‌, లేబులింగ్‌) నిబంధనలు, 2011 స్థానంలో ఇవి అమల్లోకి వస్తాయి. ఆహార పదార్థాల్లో ఉండేవాటి గురించి ప్రజలకు మరింత స్పష్టంగా తెలియజేసి, తగిన నిర్ణయం తీసుకునే విధంగా చూడడమే నూతన నిబంధనల ఉద్దేశమని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. పోషక విలువ సమాచారం అయిన కేలరీలు, శాచురేటెడ్‌ ఫ్యాట్‌, ట్రాన్స్‌ఫ్యాట్‌, యాడెడ్‌ షుగర్‌, సోడియం వంటివి ఒక్కో సర్వ్‌లో ఎంత ఉంటాయనేది ప్యాకెట్‌ ముందు భాగంలోనే పేర్కొనాలని నూతన ముసాయిదా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రోజువారీ అనుమతించిన పోషక పరిమాణంలో సంబంధిత ఆహారం ఎంత మేర ఉంటుందన్న శాతాన్ని కూడా తెలియజేయాలి. మూడు సంవత్సరాల కాలంలో కంపెనీలు ఈ నిబంధనలు క్రమంగా అమలు చేయాల్సి ఉంటుందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొంది. ఈ ముసాయిదా నిబంధనలపై నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి 30 రోజుల వరకు భాగస్వాములు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది. ప్రస్తుతం కంపెనీలు ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ ప్యాక్‌లపై వెనుక భాగంలో చిన్న అక్షరాలతో ఈ వివరాలను ఇస్తుండడం గమనార్హం. 
తయారీ, గడువు తీరే వివరాలు ఒక్కచోటే...
‘‘ప్రస్తుతం పరిశ్రమ తయారీ తేదీ, గడువు తీరే తేదీ వివరాలను ప్యాకెట్లపై రెండు భిన్న ప్రాంతాల్లో ముద్రిస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులు రెండింటినీ చూడడం కష్టమవుతోంది. నూతన నిబంధనలు ఈ రెండింటినీ ఒక్కచోటే ముద్రించాలని స్పష్టం చేస్తున్నాయి’’ అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. లేబులింగ్‌ అన్నది కంపెనీలకు, వినియోగదారులకు ప్రాథమిక సమాచార అనుసంధానంగా అభివర్ణించింది. ఇందులో వినియోగదారుల ప్రయోజనాల కోణంలో కచ్చితంగా ఆహార భద్రత, సమాచారం ఉండాలని పేర్కొంది. You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌పై మరిన్ని నిబంధనలు...

Friday 28th June 2019

లిక్విడిటీ సంక్షోభం నేపథ్యంలో సెబీ నిర్ణయాలు  యథాతథ ఒప్పందాలు వద్దు లిక్విడ్‌ స్కీమ్స్‌పై ఆంక్షలు  అధిక ఓటింగ్‌ హక్కులున్న డీవీఆర్‌షేర్లు జారీ  టెక్నాలజీ కంపెనీలకే ఈ వెసులుబాటు  సెబీ నిర్ణయాలతో మరింత పారదర్శకత అంటున్న నిపుణులు  ముంబై: కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీల్లో ఇటీవల తలెత్తిన లిక్విడిటీ సంక్షోభం నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుంది. గురువారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలను సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు.

ప్రభుత్వ బ్యాంకులకు హోల్డింగ్‌ కంపెనీ

Friday 28th June 2019

ఏటా బడ్జెట్లో దీనికి నిధుల కేటాయింపు క్రమంగా ఈ వాటాలు ప్రైవేటు చేతికి! 2014 నాటి సిఫారసులపై మళ్లీ అధ్యయనం న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఒక హోల్డింగ్‌ కంపెనీని ఏర్పాటు చేయాలన్న గత ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం మళ్లీ తెరమీదికి తెచ్చింది. బ్యాంకులకు అవసరమైన నిధుల సమీకరణకు ఈ ప్రణాళిక అనువైనదిగా భావిస్తోంది. వెటరన్‌ బ్యాంకర్‌ పీజే నాయక్‌ ఆధ్వర్యంలోని కమిటీ 2014లో చేసిన సిఫారసులకు అనుగుణంగా ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని ఆర్థిక

Most from this category