News


స్వీట్స్‌ ‘గడువు తేదీ’ ప్రదర్శించాల్సిందే

Wednesday 26th February 2020
news_main1582685983.png-32092

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇప్పటి వరకు ప్యాక్‌ చేసిన స్వీట్స్‌కు మాత్రమే గడువు తేదీతోపాటు తయారీ తేదీని ఉత్పత్తిదార్లు ముద్రిస్తున్నారు. ఇక నుంచి సాధారణ స్వీట్‌ షాపుల్లో కూడా విడిగా విక్రయించే తీపి పదార్థాల ముందు ఈ తేదీలను ప్రదర్శించాల్సిందే. 2020 జూన్‌ 1 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తున్నట్టు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) స్పష్టం చేసింది. గడువు ముగిసిన తీపి పదార్థాలను దుకాణదార్లు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నిబంధన అమలు చేయాల్సిందిగా ఫుడ్‌ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. 



You may be interested

ఎయిరిండియా రేసులో అదానీ గ్రూప్!!

Wednesday 26th February 2020

బిడ్ పత్రాల పరిశీలన తర్వాత నిర్ణయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కొనుగోలు రేసులో తాజాగా అదానీ గ్రూప్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది. బిడ్డింగ్ పత్రాలను అధ్యయనం చేసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలని సంస్థ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎయిరిండియాపై అదానీ గ్రూప్ ఆసక్తి ప్రాథమిక స్థాయిలోనే ఉందని, దాని అప్పులు.. నష్టాలపై పూర్తి స్థాయి మదింపు ఆధారంగా బిడ్ వేసేదీ లేనిదీ ఉంటుందని

మార్కెట్లోకి హోండా బీఎస్‌-VI డియో స్కూటర్‌

Wednesday 26th February 2020

ధరలు రూ.64,584 నుంచి ఆరంభం  బెంగళూరు: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా కంపెనీ డియో మోడల్‌లో బీఎస్‌ సిక్స్‌ వేరియంట్‌ను బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్‌ ధరలు రూ.64,584(ఎక్స్‌ షోరూమ్‌, బెంగళూరు) నుంచి ఆరంభమవుతాయని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లు-స్టాండర్డ్‌, డీలక్స్‌ల్లో లభ్యమవుతుందని వెల్లడించింది. మార్కెట్లోకి విడుదల చేసిన రోజే 301 స్కూటర్లను డెలివరీ చేశామని పేర్కొంది. దక్షిణాదిలో తమదే నంబర్‌ వన్‌  టూ వీలర్‌

Most from this category