News


‘‘యస్‌’’ నుంచి ‘‘నో’’ వరకు: యస్‌బ్యాంక్‌ ప్రస్థానం

Friday 6th March 2020
news_main1583466041.png-32312

యస్‌ బ్యాంక్‌ ప్రస్థానం ఇలా...

జూన్‌ 12, 2018: యస్‌ బ్యాంక్‌  ఎమ్‌డీ, సీఈఓగా రాణా కపూర్‌ పునర్నియామాకానికి వాటాదారుల ఆమోదం 

ఆగస్టు 30, 2018: యస్‌ బ్యాంక్‌కు ఎమ్‌డీగా, సీఈఓగా రాణా కపూర్‌ కొనసాగడానికి ఆర్‌బీఐ ఆమోదం 

సెప్టెంబర్‌ 19, 2018: రాణా కపూర్‌ పదవీ కాలాన్ని జనవరి 31,2019 వరకే తగ్గించిన ఆర్బీఐ 

సెప్టెంబర్‌ 21, 2018: యస్‌ బ్యాంక్‌ షేర్‌ 30 శాతం పతనం, రూ.21,951 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఆవిరి 

సెప్టెంబర్‌ 28, 2018: ప్రమోటర్‌ షేర్లను విక్రయించబోనని, కూతుళ్లకు ఇచ్చేస్తానని రాణా కపూర్‌ ప్రకటన. యస్‌ బ్యాంక్‌ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌కు క్రెడిట్‌ వాచ్‌ రేటింగ్‌ను ఇస్తున్నామని కేర్‌ రేటింగ్స్‌ వెల్లడి 

అక్టోబర్‌ 17, 2018: రాణా కపూర్‌కు మరింత గడువును ఇవ్వడానికి నిరాకరించిన ఆర్‌బీఐ. 2019, ఫిబ్రవరి 1 కల్లా కొత్త సీఈఓను నియమించుకోవాలని ఆదేశం 

అక్టోబర్‌ 25, 2018: గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి,. మార్క్‌టు మార్కెట్‌ నష్టాలు రెట్టింపు కావడం, మొండి బకాయిల కేటాయింపులు అధికంగా ఉండటంతో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోయాయి. రుణ నాణ్యత క్షీణించింది. 

నవంబర్‌ 14, 2018: చైర్మన్‌ పదవికి అశోక్‌ చావ్లా రాజీనామా. ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ పదవి నుంచి వైదొలగిన వసంత్‌ గుజరాతీ 

నవంబర్‌ 19, 2018: మరో ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ రెంటాల చంద్రశేఖర్‌ రాజీనామా 

నవంబర్‌ 27, 2018: యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌ గ్రేడ్‌చేసిన మూడీస్‌ సంస్థ. 

మార్చి 1, 2019: యస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన రవ్‌నీత్‌ గిల్‌.  3 శాతం ఎగసిన షేర్‌ ధర 

మార్చి 5, 2019: స్విఫ్ట్‌ కార్యకలాపాల విషయంలో నిబంధనలు పాటించనందుకు రూ. 1 కోటి జరిమానా విధించిన ఆర్‌బీఐ 

ఏప్రిల్‌ 26, 2019: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఆర్థిక ఫలితాలు వెల్లడి. రూ.1,507 కోట్ల నికర నష్టాలు 

ఏప్రిల్‌ 29, 2019: యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసిన మాక్వైరీ బ్రోకరేజ్‌ సంస్థ. 

ఏప్రిల్‌ 30, 2019: క్యూ4 ఫలితాల ప్రభావంతో 30 శాతం పతనమైన షేర్‌ 

మే 9, 2019: యస్‌ బ్యాంక్‌ లాంగ్‌ టర్మ్‌ రేటింగ్‌ను రేటింగ్‌ ఏజెన్సీలు-ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌, ఇక్రాలు డౌన్‌ గ్రేడ్‌ చేశాయి. 

మే 15, 2019: యస్‌ బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌లో అదనపు డైరెక్టర్‌గా ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌. గాంధీ నియామకం 

జూలై 18, 2019: రాణా కపూర్‌ తన పూర్తి వాటా షేర్లను తనఖా పెట్టారన్న వార్తలు వచ్చాయి. భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేర్‌ 

ఆగస్టు 10, 2019: సీఎఫ్‌ఓగా అనురాగ్‌ అద్లాఖ నియామకం 

సెప్టెంబర్‌ 21, 2019: యస్‌ బ్యాంక్‌లో 2.75 శాతం వాటా విక్రయించిన రాణా కపూర్‌. 6.89 శాతానికి తగ్గిన వాటా 

అక్టోబర్‌ 3, 2019: యస్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ రజత్‌ మోంగా రాజీనామా

నవంబర్‌ 1, 2019: ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో రూ.600 కోట్ల నష్టాలు 

డిసెంబర్‌ 6, 2019: యస్‌ బ్యాంక్‌కు నెగిటివ​ అవుట్‌ లుక్‌ ఇచ్చిన రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌. 9 శాతానికి పైగా పతనమైన షేర్‌ ధర 

డిసెంబర్‌ 17, 2019: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో యస్‌ బ్యాంక్‌ విలీనం కానున్నదని వినిపించిన వార్తలు 

జనవరి 10, 2020: కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సరిగ్గా లేదంటూ రాజీనామా చేసిన బోర్డ్‌ మెంటర్‌ ఉత్తమ్‌ ప్రకాశ్‌ రాజీనామా 

జనవరి 13, 2020: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చోటు చేసుకుందని, ఈ విషయమై సెబీ దర్యాప్తు చేయాలని లేఖ రాసిన ఉత్తమ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌. 6 శాతం పతనమైన షేర్‌ ధర

మార్చి 5, 2020: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని కన్సార్షియమ్‌.....యస్‌ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని వార్తలు. 26 శాతం లాభంతో రూ.36.85కు ఎగసిన షేర్‌ You may be interested

ప్రపంచ మార్కెట్లకు కరోనా షాక్‌

Friday 6th March 2020

గురువారం అమెరికా ఇండెక్సులు 3.5 శాతం పతనం  3-1 శాతంమధ్య పడిన యూరోపియన్‌ మార్కెట్లు ఆసియా మార్కెట్లలోనూ భారీ అమ్మకాల ఒత్తిడి ఆథిత్య రంగ, ట్రావెల్‌ కంపెనీ షేర్లు బోర్లా ప్రపంచ దేశాలపై సునామీలా విరుచుకు పడుతున్న కరోనా.. స్టాక్‌ మార్కెట్లలో కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా కరోనా మరణాలు 3,300కు చేరడం, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలలో కొత్త కేసులు నమోదుకావడంతో సెంటిమెంటుకు షాక్‌ తగిలినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే అమెరికా సిలికాన్‌ వ్యాలీ, సియాటెల్‌లోని టెక్‌ కంపెనీలు

ఎస్‌బీఐ చేతికి యస్‌ బ్యాంక్‌??

Friday 6th March 2020

ఎల్‌ఐసీతో కలిసి టేకోవర్‌ వార్తలు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధిస్తున్నట్లు ప్రకటించడానికి ముందు.. యస్‌ బ్యాంక్‌ను ఎల్‌ఐసీతో కలిసి ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సారథ్యంలోని కన్సార్షియం టేకోవర్ చేయనుందంటూ వార్తలు వచ్చాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కన్సార్షియం మొత్తం 49 శాతం వాటాలు కొనేలా ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. నియంత్రణాధికారాలు దక్కే స్థాయిలో వాటాలు కొనుగోలు చేసేందుకు సంబంధించి త్వరలోనే

Most from this category