News


స్నేహం, బ్యాంకింగ్‌ వేర్వేరు

Thursday 11th July 2019
news_main1562825286.png-26979

  • బ్యాంకింగ్‌ విధులకు స్నేహాన్ని దూరంగా పెట్టాలి
  • సహచరులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆదిత్య పురి సూచన

ముంబై: వ్యక్తిగత స్నేహాన్ని బ్యాంకింగ్‌ విధులకు దూరంగా ఉంచుకోవాలని తన సహచరులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ ఆదిత్య పురి సూచించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాకు గతంలో రుణ అభ్యర్థనను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... ‘‘ఒక బ్యాంకర్‌ ఏ వ్యక్తితోనైనా కలసి కాఫీ తాగొచ్చు. ఆ తర్వాత అతడు కోరుకున్నది చేయవచ్చు’’ అని చెబుతూ, తన చిరకాల సహోద్యోగి అయిన పరేష్‌ సుక్తాంకర్‌ గుర్తించి తెలియజేశారు. గతంలో విజయ్‌మాల్యాకు రుణ అభ్యర్థనను తిరస్కరించినది ఆయనే. ‘‘మీ సమాచారం కోసమే చెబుతున్నాను. వారు (మాల్యా ఉద్యోగులు) రుణం కోసం నా దగ్గరకు వచ్చారు. నేను వారికి కాఫీ అందించి, వారి అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పా. ఆ తర్వాత పరేష్‌ దాన్ని తోసిపుచ్చాడు’’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పురి తన సహచరులకు వివరించారు. తమల్‌ బందోపాధ్యాయ బ్యాంకింగ్‌పై రాసిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వివరాలు పంచుకున్నారు. మాల్యా నుంచి కాల్‌ వచ్చిన ప్రతీసారి, పరుష పదజాలం ఉపయోగించే వారని, ఆయన రక్తపోటు కూడా పెరిగేదని చెప్పారు. కనుక స్నేహం, బ్యాంకింగ్‌ రెండూ ఓకే ఒరలో ఇమడలేవన్నారు. రుణాలు, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌పై ఈ విధమైన స్పష్టత ఉంటే బ్యాంకుకు ఇబ్బందికర పరిస్థితులు రావన్నారు. 



You may be interested

భారత్‌, రష్యా మధ్య బలమైన ఆర్థిక సహకారం

Thursday 11th July 2019

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ న్యూఢిల్లీ: భారత్‌, రష్యా తమ మధ్య ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే దిశగా కలసి పనిచేస్తున్నాయని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. వ్యవసాయం, ఆగ్రో ప్రాసెసింగ్‌ విభాగాల్లో సహకారానికి అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. ఢిల్లీలో బుధవారం జరిగిన భారత్‌-రష్యా రెండో వ్యూహాత్మక ఆర్థిక చర్చల కార్యక్రమాన్ని (ఐఆర్‌ఎస్‌ఈడీ) ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రష్యాతో తన

జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.లక్ష కోట్ల డిపాజిట్లు

Thursday 11th July 2019

ఐదేళ్లలో రికార్డు న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం ఆరంభమైన జన్‌ధన్‌ యోజన పథకం ఓ రికార్డును చేరుకుంది. ఈ పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో సామాన్యుల డిపాజిట్లు రూ.లక్ష కోట్ల మార్కును చేరాయి. జూలై 3 నాటికి ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (పీఎంజేడీవై) కింద 36.06 కోట్ల ఖాతాల్లోని మొత్తం డిపాజిట్లు రూ.1,00,495.94 కోట్లుగా ఉన్నట్టు ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్‌ 6 నాటికి ఈ

Most from this category