News


తాజా మొండి బకాయిలు తగ్గాయ్‌: ఎస్‌బీఐ

Wednesday 19th December 2018
news_main1545193942.png-23063

హైదరాబాద్‌: తాజా మొండి బకాయిలు తగ్గాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రిటైల్‌ అండ్‌ డిజిటల్‌ బ్యాంకింగ్‌ విభాగ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. భారీ మొండి బకాయిల ఖాతాలకు సంబంధించి పరిష్కారం కోసం ఎన్‌సీఎల్‌టీలో  ప్రయత్నాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మొండి బకాయిలు తగ్గుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ హైదరాబాద్‌ మెయిన్‌ బ్రాంచ్‌ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో మొండి బకాయిలు పెరగవు...
ఎన్‌సీఎల్‌టీకి నివేదించిన భారీ మొండి బకాయిల్లో కొన్ని కేసులు పరిష్కారమయ్యాయని, మరి కొన్ని కేసుల్లో పరిష్కారం తుది దశలో ఉందని ప్రవీణ్‌ కుమార్‌ గుప్తా వివరించారు. మొత్తం మీద రానున్న రెండు నెలల్లో ఈ బకాయిల సమస్య ఒక కొలిక్కి రాగలదన్నారు. తాజా మొండి బకాయిలు తగ్గాయంటూ... భవిష్యత్తులో మొండి బకాయిలు పెరిగే సమస్యే లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. 
మరో ఆర్నెల్లు గడువు కోరతాం...!
మహారాష్ట్ర, కర్నాటకల్లో మాత్రమే వ్యవసాయ రంగ రుణాల్లో మొండి బకాయిలు పెరిగాయని, దేశవ్యాప్తంగా ఈ ధోరణి లేదని గుప్తా స్పష్టంచేశారు. పాత డెబిట్‌ కార్డ్‌ల స్థానంలో మరింత సురక్షితమైన ఫీచర్లున్న కొత్త డెబిట్‌ కార్డ్‌ల జారీ కొనసాగుతోందన్నారు. పాత డెబిట్‌ కార్డులను మార్చుకోవడానికి ఈ నెల 31 గడువు తేదీ అని, ఇప్పటికే చాలా వరకూ కొత్త కార్డ్‌లను జారీ చేశామని వివరించారు. ఇంకా కొన్ని కార్డులను మార్చాల్సి ఉందని,  ఇది చాలా పెద్ద బాధ్యత అని చెప్పారాయన. అందుకే గడువును మరో ఆర్నెల్లు పొడిగించాలని ఆర్‌బీఐని కోరినట్లు తెలియజేశారు. విదేశాల్లోని బ్రాంచ్‌ల హేతుబద్ధీకరణ పాత ప్రణాళిక ప్రకారమే జరుగుతుందని, దీనికి సంబంధించిన కొత్త సమీక్షా విధానమేదీ లేదని వివరించారు. 



You may be interested

అమెరికా ఉత్పత్తులపై సుంకాల పెం‍పు వాయిదా

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: అమెరికా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల పెంపును భారత్‌ నాల్గవసారి వాయిదావేసింది. జనవరి 31వ తేదీ వరకూ ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్రం ఒక ప్రకటన చేస్తూ, సుంకాల నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఆర్థిక శాఖను వాణిజ్య మంత్రిత్వశాఖ కోరినట్లు తెలియజేసింది. రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చల నేపథ్యంలో కేం‍్రదం తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... ♦ స్టీల్‌, అల్యూమినియంసహా భారత్‌ నుంచి దిగుమతులపై అమెరికా

ఉర్జిత్‌ను రాజీనామా చెయ్యమనలేదు

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌ పదవికి రాజీనామా చేయాలని ఉర్జిత్‌ పటేల్‌కు ప్రభుత్వం కోరలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. జవహార్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలోను, యశ్వంత్‌ సిన్హా ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలోను సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్ల రాజీనామాలను జైట్లీ ప్రస్తావించారు. వివిధ రంగాల్లో నెలకొన్న నిధుల కొరత (లిక్విడిటీ సమస్య), ఇతర అంశాలను ఆర్‌బీఐ పరిష్కరించాలని మాత్రం తాము కోరామని

Most from this category