News


గూగుల్‌పై ఫ్రాన్స్‌లో దావా

Thursday 27th June 2019
news_main1561619235.png-26613

  • డేటా భద్రత చట్టాలు ఉల్లంఘించినందుకే?

ప్యారిస్‌: అమెరికన్ టెక్ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్‌లో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా క్లాస్ యాక్షన్ దావా నమోదైంది. కఠినతరమైన యూరోపియన్ యూనియన్ డేటా భద్రత చట్టాలను ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలపై వినియోగదారుల హక్కుల సంస్థ యూఎఫ్‌సీ-క్యూ కొయిసర్‌ గ్రూప్‌ ఈ దావా వేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్ ఆధారిత ఫోన్లు, ట్యాబ్‌లు మొదలైన డివైజ్‌లను ఉపయోగించే యూజర్ల వ్యక్తిగత డేటాను గూగుల్‌ మోసపూరితంగా దొంగిలిస్తోందని, దీన్ని అరికట్టే లక్ష్యంతోనే క్లాస్ యాక్షన్ సూట్ వేశామని యూఎఫ్‌సీ గ్రూప్ ప్రెసిడెంట్ అలెయిన్ బెజోట్‌ తెలిపారు. ఒకవేళ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన పక్షంలో ఫ్రాన్స్‌లో 2.8 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఒక్కొక్కరికీ 1,000 యూరోల దాకా పరిహారం లభించే అవకాశాలున్నట్లు వివరించారు. ఇప్పటిదాకా 200 మంది పైగా ఈ దావాలో చేరినట్లు బెజోట్ చెప్పారు. ఈ ఏడాది జనవరిలోనే ఫ్రాన్స్‌కి చెందిన డేటా నియంత్రణ సంస్థ సీఎన్‌ఐఎల్‌.. గూగుల్‌పై 50 మిలియన్ యూరోల జరిమానా విధించింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో వినియోగదారులకు విధించే అభ్యంతరకరమైన నిబంధనలు తొలగించాలంటూ ప్యారిస్‌ జిల్లా స్థాయి కోర్టు కూడా గూగుల్‌ను ఆదేశించింది. 
గూగుల్ మ్యాప్స్‌లో మరో భద్రతా ఫీచర్‌ ..
గూగుల్ మ్యాప్స్‌ తాజాగా భారత్‌లో స్టే సేఫర్ పేరిట కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. వాహనం దారి తప్పిన పక్షంలో వెంటనే యూజర్లను హెచ్చరించడం ఇందులో ప్రత్యేకత. ఈ ఫీచర్‌ ద్వారా.. ప్రయాణికులు తమ ట్రిప్‌ గురించిన వివరాలు ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులు, మిత్రులకు లైవ్‌లో అందజేయొచ్చని గూగుల్ పేర్కొంది. గూగుల్ మ్యాప్స్ యాప్‌లో వెళ్లాల్సిన గమ్యస్థానం, మార్గం గురించి సెర్చి చేసిన తర్వాత 'గెట్ ఆఫ్‌-రూట్ అలర్ట్స్‌' ఆప్షన్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని వివరించింది. ఒకవేళ డ్రైవర్‌ గానీ గూగుల్ మ్యాప్ సూచించిన రూటుకు భిన్నంగా దాదాపు అర కిలోమీటరు మేర వాహనాన్ని దారి మళ్లించిన పక్షంలో వెంటనే ప్రయాణికుల ఫోన్‌కు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. You may be interested

మొండి బండ.. మరింత భారం !

Thursday 27th June 2019

మూలధన నిధులు మొండి కేటాయింపులకే  బ్యాంక్‌ లాభాలపై మొండి భారం  దివాలా చట్టం ఊరట అంతంతే  ప్రైవేట్‌ బ్యాంక్‌లకూ పెరుగుతున్న సమస్య  మొండి బకాయిలు...ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సమస్య తీవ్రత తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, అవేవీ ఫలించడం లేదు.  ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రమవుతోంది.  ఈ సమస్య కారణంగానే గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల

ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీపై జీ- 20 దేశాల దృష్టి

Thursday 27th June 2019

లండన్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ ప్రతిపాదించిన క్రిప్టో కరెన్సీ లిబ్రా కాయిన్‌పై శక్తిమంతమైన జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఫేస్‌బుక్ క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో ఫేస్‌బుక్ అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఫేస్‌బుక్ ప్రాజెక్టు లక్ష్యాలు భారీగానే ఉన్నాయని, అయితే నిబంధనలకు లోబడే అది

Most from this category