News


విదేశీ బొమ్మలు, పాదరక్షలు ప్రియం

Sunday 2nd February 2020
Markets_main1580617405.png-31424

- దిగుమతి సుంకాలు పెంపు
- ఫర్నిచర్‌, వాల్‌ ఫ్యాన్లపై కూడా

న్యూఢిల్లీ: మేకిన్ ఇండియా నినాదానికి తోడ్పాటునిచ్చేలా దేశీయంగా తయారీ రంగానికి మరింత ప్రోత్సాహమిచ్చే దిశగా కేంద్రం పలు ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలను పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించింది. వీటిలో బొమ్మలు, పాదరక్షలు, ఫర్నిచర్ తదితర ఉత్పత్తులు ఉన్నాయి. దిగుమతి సుంకం .. పాదరక్షలపై 25 శాతం నుంచి 35 శాతానికి, ఆటబొమ్మలు.. పజిల్స్‌ మొదలైన వాటిపై 20 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది. సీట్లు, మ్యాట్రెస్ సపోర్ట్‌, లైటింగ్‌ ఫిటింగ్స్‌ వంటి వాటిపై కస్టమ్స్ సుంకం ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది. "ఉపాధి కల్పనకు చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రంగం కీలకమైనది. చౌకైన, నాణ్యత లేని దిగుమతులు.. వాటి వృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశీ ఎంఎస్‌ఎంఈలు మరింత నాణ్యతతో తయారు చేస్తున్న ఉత్పత్తుల.. దిగుమతులను తగ్గించడంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. దిగుమతులపై సుంకాల పెంపుతో 'స్వదేశీ' ఉత్పత్తుల తయారీగి మరింత ఊతం లభించగలదవి ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (టీపీసీఐ) చైర్మన్ మోహిత్ సింగ్లా పేర్కొన్నారు. బడ్జెట్‌లో వాల్ ఫ్యాన్స్‌పై కస్టమ్స్ సుంకం ప్రస్తుతమున్న 7.5 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. పోర్సెలిన్‌ లేదా చైనా సెరామిక్‌, క్లే ఐరన్‌, ఉక్కు, ఇత్తడితో తయారు చేసిన టేబుల్‌వేర్‌.. కిచెన్‌వేర్‌పై సుంకాన్ని రెట్టింపు చేసి 20 శాతానికి పెంచారు. 
    ఆగ్నేయాసియా దేశాల కూటమితో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా దేశంలోకి చౌక దిగుమతులు భారీగా వస్తున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ దేశాల ద్వారా చైనా పెద్ద ఎత్తున ఫుట్‌వేర్‌ను భారత్‌కు ఎగుమతి చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 2017-18లో చైనా, హాంకాంగ్‌ నుంచి 282 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆటవస్తువులు దిగుమతి కాగా 2018-19లో ఇది 304 మిలియన్ డాలర్లకు పెరిగింది. 

పెరిగేవి.. తగ్గేవి!
ఎక్సయిజ్‌ డ్యూటీని పెంచడంతో సిగరెట్లు, హుక్కా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులు ఖరీదు కానున్నాయి. ఈ బాటలో సుంకాలు పెంచడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెలు, ఫ్యాన్లు, టేబుళ్లు, ఫుట్‌వేర్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, టేబుల్‌వేర్‌, కిచెన్‌వేర్‌, బొమ్మలు, ఫర్నీచర్‌ తదితర ఇంపోర్టెడ్‌ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఈ జాబితాలో దిగుమతి చేసుకునే బటర్‌ నెయ్యి, బటర్‌ నూనె, పీనట్‌ బటర్‌, మొక్క జొన్న, చ్యూయింగ్‌ గమ్‌, షెల్‌తో ఉన్న వాల్‌నట్స్‌, సోయా ఫైబర్‌, సోయా ప్రొటీన్‌ తదితరాలు కూడా చేరాయి. ఇవేకాకుండా దిగుమతయ్యే ఫుట్‌వేర్‌, షేవర్స్‌, హెయిర్‌ క్లిప్స్‌, హెయిర్‌ రిమూవింగ్‌ వస్తువులు, వాటర్‌ ఫిల్టర్‌, గ్లాస్‌వేర్‌తోపాటు.. పింగాణీ పాత్రలు, ఎమరాల్డ్స్‌, జెమ్‌ స్టోన్స్‌, వాటర్‌ హీటర్లు, హెయిర్‌ డయ్యర్స్‌, ఎలక్ట్రిక్‌ ఐరన్స్‌, ఒవెన్స్‌, కుకర్స్‌, గ్రైండర్స్‌, కాఫీ, టీ మేకర్స్‌ ధరలు సైతం పెరగనున్నాయి. వీటితోపాటు దిగుమతి చేసుకునే పీసీబీలు, సెల్యులర్‌ మొబైల్‌ ఫొన్లు, డిస్‌ప్లే ప్యానళ్లు, టచ్‌ అసెంబ్లీలు, మొబైల్స్‌లో వినియోగించే ఫింగర్‌ప్రింట్‌ రీడర్లు ల్యాంపులు, లైటింగ్‌ ఫి‍ట్టింగ్స్‌, స్టేషనరీ వస్తువుల ధరలు సైతం పెరగనున్నాయి. బడ్జెట్‌లో కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడంతో దిగుమతి చేసుకునే న్యూస్‌ప్రింట్‌, క్రీడా పరికరాలు, మైక్రోఫోన్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు చౌక కానున్నాయి.You may be interested

రక్షణ రంగానికి 3.37 లక్షల కోట్లు కేటాయింపు

Sunday 2nd February 2020

గతం కంటే 5.8 శాతం పెరిగిన రక్షణ బడ్జెట్‌ న్యూఢిల్లీ: బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభంలో దేశ భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రక్షణ రంగానికి రూ. 3.37 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. పొరుగు దేశాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రక్షణ రంగం అధిక ఆర్థిక కేటాయింపుల కోసం ఎదురుచూస్తుండగా గత యేడాదికంటే రక్షణ బడ్జెట్‌ కేటాయింపులను కేంద్రం ఆరుశాతం కూడా పెంచకపోవడం

టెలికం నుంచి రూ. 1.33 లక్షల కోట్ల వసూళ్లు

Sunday 2nd February 2020

2020-21 బడ్జెట్‌లో అంచనా న్యూఢిల్లీ: స్పెక్ట్రం యూసేజి చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయీలు రూపంలో టెలికం రంగం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 1.33 లక్షల కోట్ల మేర రాగలవని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి కమ్యూనికేషన్స్ విభాగం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 58,687 కోట్లు రావొచ్చని బడ్జెట్‌లో పేర్కొంది. వాస్తవానికి ఇది రూ. 50,520 కోట్ల స్థాయిలో ఉండొచ్చని 2019-20 బడ్జెట్‌లో కేంద్రం అంచనా

Most from this category