News


ఫోర్డ్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం

Wednesday 18th March 2020
news_main1584504647.png-32549


10,000 మందికి కంపెనీ సూచన

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఆటో మొబైల్‌ రంగ దిగ్గజం ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ(ఎఫ్‌ఎంసీ) తన భారత ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఫెసిలిటీని కల్పిస్తోంది. కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ కంపెనీలో వ్యాపించకుండా ఉండేందుకు ఇక్కడి 10,000 మంది ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించినట్లు ప్రకటించింది. ఫోర్డ్ ఫెసిలిటీలోనే పనిచేయాల్సిన ఉద్యోగులను మినహాయించి మిగిలిన వారికి ఈ అవకాశం ఇచ్చినట్లు వివరించింది. ఫోర్డ్ ఇండియా, గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఉద్యోగులు ఇంటి వద్ద ఉండే సేవలు అందించాలని సోమవారమే సూచించింది. ఇక ఈ అవకాశం లేని ఉద్యోగులకు వైరస్‌ వ్యాపించకుండా కార్యాలయాల్లో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. ఇదే విధంగా వోల్వో కార్ ఇండియా కూడా తన ఉద్యోగుల్లో 40 మందికి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సౌకర్యం ఇచ్చింది. ముంబై, పూణే ప్రాంతాల్లోని 50 శాతం ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేయాల్సి ఉంటుందని ఎఫ్‌సీఏ ఇండియా ఆటోమొబైల్స్ ప్రకటించింది. 



You may be interested

ట్రంప్‌ కార్డ్‌- యూఎస్‌ జోష్‌

Wednesday 18th March 2020

5 శాతం జంప్‌చేసిన ఇండెక్సులు ఫెడరల్‌ రిజర్వ్‌ లిక్విడిటీ బూస్ట్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సహాయక చర్యల దన్ను ఫైజర్‌, రీజెనరాన్‌ ఫార్మా హైజంప్‌ కరోనా ప్రభావానికి చెక్‌ పెట్టే బాటలో ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా ప్రకటించిన సహాయక చర్యలు ఇన్వెస్టర్లను మెప్పించాయి. దీంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 5 శాతం జంప్‌చేశాయి. ఇప్పటికే కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను ఏకంగా జీరో(0-0.25 శాతం) స్థాయికి దించడంతోపాటు.. 700 బిలియన్‌ డాలర్ల బాండ్ల

హీరో ఎలక్ట్రానిక్స్‌​ చేతికి టీ అండ్‌ వీఎస్‌ కంపెనీ

Wednesday 18th March 2020

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌కు చెందిన చిప్‌ డిజైన్‌ సర్వీసెస్‌ సంస్థ టెస్ట్‌ అండ్‌ వెరిఫికేషన్‌ సొల్యూషన్స్‌(టీ అండ్‌ వీఎస్‌)ను హీరో ఎలక్ట్రానిక్స్‌ కొనుగోలు చేసింది. టీ అండ్‌ వీఎస్‌ను తమ గ్రూప్‌ కంపెనీ టెస్సాల్వ్‌ కొనుగోలు చేసిందని హీరో ఎలక్ట్రానిక్స్‌ సీఈఓ నిఖిల్‌ రాజ్‌పాల్‌ పేర్కొన్నారు. కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించలేదు. టీ అండ్‌ వీఎస్‌ కొనుగోలుతో టెస్సాల్వ్‌ చిప్‌ డిజైన్‌ సామర్థ్యాలు మరింతగా మెరుగుపడుతాయని వివరించారు. టెస్వాల్వ్‌లో పనిచేసే ఇంజినీర్ల

Most from this category