News


త్వరలో యురేకా ఫోర్బ్స్‌ లిస్టింగ్‌ !

Wednesday 20th November 2019
news_main1574220465.png-29715

న్యూఢిల్లీ: ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ తన అనుబంధ సం‍స్థ, యురేకా ఫోర్బ్స్‌ను త్వరలో స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయనున్నది. వాటాదారులకు మరింత విలువను అందించడం లక్ష్యంగా యురేకా ఫోర్బ్స్‌ను లిస్టింగ్‌ చేయడం కానీ, లేదా ఈ కంపెనీలో కొంత వాటాను విక్రయించడానికి గానీ, లేదా ఈ రెండింటికి గానీ చేయడానికి ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు తగిన ప్రణాళికలను రూపొందించడానికి యాజమాన్యానికి డైరెక్టర్ల బోర్డ్‌ అధికారాలిచ్చింది. 
తాగు నీటి శుద్ధి ఉపకరణాల విషయంలో అగ్రస్థాయి కంపెనీల్లో యురేకా ఫోర్బ్స్‌ ఒకటి. ఆక్వాగార్డ్‌ బ్రాండ్‌ ఈ కంపెనీదే.  వాక్యూమ్‌ క్లీనర్‌, సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సిస్టమ్స్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్స్‌ విభాగాల్లో కూడా ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.2,961 కోట్ల స్ధూల టర్నోవర్‌ సాధించింది. ఈ కంపెనీ 53 దేశాలతో పాటు మన దేశంలో 1,500 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీకి చెందిన ఫోర్బ్స్‌ అండ్‌ కంపెనీకి అనుబంధ సంస్థగా యురేకా ఫోర్బ్స్‌ పనిచేస్తోంది.



You may be interested

కొనుగోలు శక్తి తగ్గొచ్చు...

Wednesday 20th November 2019

ఎస్‌బీఐ ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఈ సారి రుతుపవనాలు సాధారణం కంటే మెరుగ్గా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో నీటి లభ్యత పెరిగింది. అయితే నాట్లు ఆలస్యం కావడం, పంట విస్తీర్ణం తగ్గడంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి ఆర్థిక వ్యవస్థ మరింత నెమ్మదించే అవకాశం ఉందని ఎస్‌బీఐ గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ అన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌

ఈ నెల 22 నుంచి సీఎస్‌బీ ఐపీఓ

Wednesday 20th November 2019

26న ముగింపు  ప్రైస్‌బ్యాండ్‌ రూ.193-195 వచ్చే నెల 4న లిస్టింగ్‌ ఇష్యూ సైజు రూ.410 కోట్లు ! ముంబై: కేరళ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీఎస్‌బీ బ్యాంక్‌(గతలో కేథలిక్‌ సిరియన్‌ బ్యాంక్‌) ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 22 (ఈ శుక్రవారం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 26న ముగిసే ఈ ఐపీఓకు ప్రైస్‌బ్యాండ్‌గా రూ.193-195ను సీఎస్‌బీ బ్యాంక్‌ నిర్ణయించింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.24 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను

Most from this category