News


ఫోర్బ్స్ కుబేరుడు మళ్లీ అంబానీయే

Saturday 12th October 2019
news_main1570853156.png-28835

- వరుసగా 12వ ఏడాది దేశంలో నంబర్‌ వన్ 
- 51.4 బిలియన్ డాలర్ల సంపద

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడిగా వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా 12వ ఏడాదీ అగ్రస్థానంలో నిల్చారు. టెలికం వెంచర్ జియో కార్యకలాపాలు గణనీయంగా విస్తరించిన నేపథ్యంలో ఆయన సంపద మరో 4.1 బిలియన్ డాలర్లు పెరిగి 51.4 బిలియన్ డాలర్లకు చేరింది. 2019కి సంబంధించి ఫోర్బ్స్‌ ఇండియా మ్యాగజైన్ ఈ మేరకు భారత్‌లో సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్ అదానీ .. ఎనిమిదో స్థానం నుంచి ఏకంగా రెండో స్థానానికి చేరారు. ఆయన సంపద విలువ 15.7 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఫోర్బ్స్ లెక్కగట్టింది. అదానీ గ్రూప్‌.. ఎయిర్‌పోర్టులు మొదలుకుని డేటా సెంటర్ల దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరించడం ఆయనకు కలిసివచ్చింది. 15.6 బిలియన్ డాలర్ల సంపదతో హిందుజా సోదరులు మూడో స్థానంలో ఉన్నారు. ఎకానమీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫోర్బ్స్‌ ఇండియా కుబేరుల మొత్తం సంపద గతేడాదితో పోలిస్తే 2019లో 8 శాతం క్షీణించి 452 బిలియన్ డాలర్లకు తగ్గింది. టాప్ 100 సంపన్నుల్లో సగం మంది నికర సంపద గణనీయంగా తగ్గింది. 
- ఈసారి కనీసం 1.4 బిలియన్ డాలర్ల సంపద ఉన్న వారిని ఫోర్బ్స్ సంపన్నుల లిస్టులో చేర్చింది. గతేడాది ఇది 1.48 బిలియన్ డాలర్లు.
- గతంలో లిస్టులో స్థానం కోల్పోయిన వారిలో నలుగురు ఈసారి మళ్లీ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొఫత్‌రాజ్‌ మునోత్‌ (కల్పతరు), రజ్జు ష్రాఫ్ (యూపీఎల్‌), ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు కె దినేష్‌, ఎస్‌డీ శిబులాల్‌ వీరిలో ఉన్నారు.
- 2019 జాబితాలో ఆరుగురు కొత్తగా చోటు సాధించారు. అల్కెమ్ ల్యాబరేటరీస్‌కి చెందిన సింగ్ కుటుంబం, బైజు రవీంద్రన్‌ (బైజూస్‌), మహేంద్ర ప్రసాద్‌ (అరిస్టో ఫార్మా), మనోహర్‌ లాల్‌.. మధుసూదన్ అగర్వాల్‌ (హల్దీరామ్ స్నాక్స్‌), రాజేష్ మెహ్రా (జాక్వార్‌), సందీప్ ఇంజినీర్‌ (ఆస్ట్రల్ పాలీ టెక్నిక్‌) వీరిలో ఉన్నారు. 
- తన సంపదలో సింహభాగాన్ని విరాళంగా ప్రకటించడంతో ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ 7.2 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానం నుంచి 17వ స్థానానికి తగ్గారు. 
-  ఆటోమొబైల్‌, కన్జూమర్ గూడ్స్ విభాగాలు డిమాండ్ మందగించి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయా రంగాలకు చెందిన సంపన్నుల సంపద తగ్గింది. మదర్‌సన్ సుమి సిస్టమ్స్‌ అధినేత వివేక్ చాంద్ సెహ్‌గల్‌ సంపద సగానికి పైగా కరిగిపోయింది (2.45 బిలియన్ డాలర్లకు). దీంతో ఆయన 52వ స్థానానికి పరిమితమయ్యారు. 

టాప్ 10 కుబేరులు..

ర్యాంకు    పేరు       సంస్థ     సంపద (బిలియన్ డాలర్లలో)
1.      ముకేశ్ అంబానీ  రిలయన్స్      51.4
2.     గౌతమ్ అదానీ   అదానీ గ్రూప్     15.7
3. హిందుజా సోదరులు  అశోక్ లేల్యాండ్  15.6
4. పల్లోంజీ మిస్త్రీ  షాపూర్‌జీ పల్లోంజీ 15
5. ఉదయ్‌ కొటక్‌  కొటక్ మహీంద్రా బ్యాంక్ 14.8
6. శివ్‌ నాడార్‌ హెచ్‌సీఎల్‌ 14.4
7. రాధాకిషన్ దమానీ అవెన్యూ సూపర్‌మార్ట్స్ 14.3
8. గోద్రెజ్ కుటుంబం గోద్రెజ్ గ్రూప్ 12
9.  లక్ష్మ నివాస్ మిట్టల్‌ ఆర్సెలర్ మిట్టల్ 10.5
10. కుమార మంగళం బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్  9.6

ఫోర్బ్స్‌లో తెలుగు దిగ్గజాలు

ర్యాంకు పేరు  సంస్థ సంపద (బిలియన్ డాలర్లలో)
37  మురళి దివి   దివీస్ ల్యాబ్ 3.4
39    పి.పి. రెడ్డి  మేఘా ఇంజినీరింగ్  3.3
59   పి.వి. రామ్‌ప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా  2.25
82  'డాక్టర్ రెడ్డీస్‌' కుటుంబం డాక్టర్ రెడ్డీస్ ఫార్మా  1.76You may be interested

పరిశ్రమలు.. కకావికలం!

Saturday 12th October 2019

- ఆగస్టులో ఉత్పాదకత 1.1 శాతం క్షీణత - ఏడేళ్లలో అత్యంత ఘోరమైన పనితీరు - క్యాపిటల్‌ గూడ్స్‌,  కన్జూమర్‌ డ్యూరబుల్స్ భారీ పతనం - తయారీ, విద్యుత్‌, మైనింగ్‌ అన్నీ పేలవమే... న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదుచేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా -1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత

మెప్పించిన ఇన్ఫీ!

Saturday 12th October 2019

- క్యూ2లో లాభం రూ. 4,019 కోట్లు, 2.2 శాతం తగ్గుదల - సీక్వెన్షియల్‌గా మాత్రం 6 శాతం అప్‌... - ఆదాయం గైడెన్స్‌ పెంపు - రూ. 8 మధ్యంతర డివిడెండు - షేరు 4 శాతం జంప్‌... న్యూఢిల్లీ/బెంగళూరు: దేశీయంగా రెండో అతి పెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌.. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం నికర లాభం స్వల్పంగా 2.2 శాతం

Most from this category