STOCKS

News


చిన్న పరిశ్రమలకు డబ్బు కొరత రానీయం!

Saturday 28th September 2019
news_main1569646475.png-28598

  • ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌
  • వివిధ మంత్రిత్వశాఖల నుంచి
  • రూ.40,000 కోట్ల బకాయిలు చెల్లింపు
  • అక్టోబర్‌ మొదటివారంలోపు
  • మిగిలిన బకాయిల బదలాయింపు
  • మంత్రిత్వశాఖల వ్యయ ప్రణాళికలకు సూచన
  •  తద్వారా ఆర్థిక వృద్ధికి జోష్‌

న్యూఢిల్లీ: చిన్న లఘు మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) నిధుల కొరత రాకుండా తగిన అన్ని చర్యలనూ కేం‍ద్రం తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. వస్తు, సేవల సరఫరాలకు సంబంధించి వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి ఎంఎస్‌ఎంఈలకు రూ.40,000 కోట్ల బకాయిలను ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఆర్థికమంత్రి వెల్లడించారు. న్యాయపరమైన అంశాల్లో చిక్కుకోని మిగిలిన బకాయిలను అక్టోబర్‌ మొదటి వారం లోపు  చెల్లించేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి స్పష్ట చేశారు. ఎంఎస్‌ఎంఈలకు చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.60,000 కోట్లని కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు. 21 కీలక మౌలిక పరిశ్రమ విభాగాల అత్యున్నత స్థాయి అధికారులతో నిర్మలా సీతారామన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. అనంతరం ఆమె చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
- ఆర్థికాభివృద్ధికి తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాల పెంపుద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఇందులో భాగంగా వచ్చే నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన సమగ్ర వ్యయ ప్రణాళికలను సమర్పించాలని వివిధ మంత్రిత్వశాఖలు, ఆయా విభాగాలను కోరడం జరిగింది. 
- చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడకుండా ఉండాలని ప్రభుత్వం ఎంతమాత్రం కోరుకోదు. వివిధ శాఖలకు చేసిన సేవలు, వస్తు సరఫరాలకు సంబంధించి ఎటువంటి బకాయిలు ఉండకూడదనే ఆర్థికమంత్రి భావిస్తోంది. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఆయా బకాయిలను ప్రభుత్వ శాఖలు తక్షణం క్లియర్‌ చేయాలన్నదే నా ఉద్దేశం. 
- బడ్జెట్‌ అంచనాల మేర మూలధన వ్యయాలకు కేంద్రం కట్టుబడి ఉంది. అందుకు తగిన బాటలోనే కొనసాగుతోంది. బడ్జెట్‌ అంచనాలను అందుకుంటామనడంలో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదు. 
- వినియోగం పెరగాలి. రుణ వృద్ధీ జరగాలి. తద్వారా గణనీయమైన ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది. 
- కార్పొరేట్‌ పన్ను తగ్గింది. వ్యయ ప్రణాళికలు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ద్రవ్యలోటు సవాలు నెలకొంటుందన్న విశ్లేషణలపై అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ, ద్రవ్యలోటు అంకెలను ప్రభుత్వం మరోసారి పునఃసమీక్షిస్తుందని తెలిపారు. 
- కాగా మూలధన పెట్టుబడులపై ఆర్థికమంత్రి శనివారం ప్రభుత్వ రంగ సంస్థల చీఫ్‌లతో సమావేశం కానున్నారు. ఆర్థికశాఖ సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

మూలధన పెట్టుబడులకు ప్రాధాన్యత
2019-2020 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) ఆరేళ్ల కనిష్ట స్థాయి 5 శాతానికి పడిపోయిన వృద్ధి భారీ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, గడచిన నాలుగు ద్వైమాసికాల్లో 1.1 శాతం తగిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో- ప్రస్తుతం 5.4 శాతం) వంటి పరిణామాల నేపథ్యంలో  21 కీలక మౌలిక పారిశ్రామిక విభాగాల అధికారులతో ఆర్థిక మంత్రి జరిపిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యయ వ్యవహారాల కార్యదర్శి జీసీ ముర్మూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకూ చూస్తే, మౌలిక రంగానికి చెందిన పలు మంత్రిత్వశాఖలు తమ మూలధన పెట్టుబడుల ప్రణాళికలు విషయంలో 50 శాతం లక్ష్యాలను సాధించాయని ముర్మూ సందర్భంగా తెలిపారు.  కేంద్రం నిర్దేశించుకున్న వ్యయ లక్ష్యాలు డిమాండ్‌ను గణనీయంగా పెంచుకోడానికి దోహదపడతాయని ఆయన తెలిపారు. 2019-20 బడ్జెట్‌ ప్రకారం- కేంద్రం వ్యయ లక్ష్యాలు రూ.27.86 లక్షల కోట్లు. ఇందులో ఒక్క మూలధన వ్యయాల మొత్తం రూ.3.38 లక్షల కోట్లు. దీనితోపాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ (జీఏఐ)గా మంత్రిత్వశాఖలు, విభాగాలకు మరో రూ.2.07 లక్షల కోట్లను క్యాపిటల్‌ అసెట్స్‌ సృష్టికి చెల్లించడం జరుగుతుందని పేర్కొనారు. దీనితో 2019-20లో మూలధన పెట్టుబడులుగా (క్యాపెక్స్‌) రూ.5.45 లక్షల కోట్లు సమకూర్చినట్లు అవుతుందని వివరించారు. అయితే ఇందులో రూ.1.36 లక్షల కోట్ల  (40.28 శాతం) బడ్జెటరీ క్యాపెక్స్‌ వినియోగం ఆగస్టు వరకూ నమోదయ్యిందని తెలిపారు. దీనికి జీఏఐ మొత్తం రూ.0.82 లక్షల కోట్లనూ (కేటాయింపుల్లో 39.7 శాతం) కలుపుకోవాల్సి ఉందన్నారు. దీనితో క్యాపెక్స్‌ సృష్టి మొత్తం విలువ ఆగస్టుకు రూ.2.18 లక్షల కోట్ల(40 శాతం)ని ఆయన తెలిపారు. స్థూల బడ్జెటరీ మద్దతు (జీబీఎస్‌)తోపాటు మరో రూ.0.57 లక్షల కోట్ల నూ అదనపు బడ్జెటరీ వనరుగా (ఈబీఆర్‌)గా మంత్రిత్వశాఖలకు కేటాయించడం జరిగిందని ఉన్నతాధికారి తెలిపారు. వీటిలో ఇప్పటికే రూ.0.46 లక్షల కోట్లను ఆమోదించడం జరిగిందని వివరించారు. ‘‘క్యాపిటల్‌ వ్యయాలు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతున్నాయి. 100 శాతం బడ్జెట్‌ అంచనాలను చేరుతాం’’ అని కార్యదర్శి ధీమా వ్యక్తం చేశారు. 2019-20 సవరిత అంచనాల మదింపునకూ, 2020-21 బడ్జెట్‌ అంచనాల చర్చకూ మంత్రిత్వశాఖలు, విభాగాలతో సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్న ఆయన, ఈ చర్చలు అక్టోబర్‌ 2019 మధ్యస్థం నుంచీ ప్రారంభమవుతాయని తెలిపారు. You may be interested

కన్సాలిడేషన్‌ దశలో నిఫ్టీ

Saturday 28th September 2019

నిఫ్టీ 50 శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ప్రారంభమైనప్పటికి 11,600 స్థాయి వద్ద నుంచి  వెనుతిరిగింది. చివరికి రోజువారి చార్టులో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచి 11,500 సమీపంలో ముగిసింది. గత సెషన్‌లో నిఫ్టీ 58.80 పాయింట్లు కోల్పోయి 11,512 వద్ద క్లోజయిన విషయం తెలిసిందే. ‘‘స్వల్పకాలానికి గాను ​‘పతనమయినప్పుడు కొనుగోలు చేయడమనే’ వ్యూహాన్ని నిఫ్టీ విషయంలో అనుసరించడం మంచిది. పోజిషన్స్‌ తీసుకునే ట్రేడర్లు నిఫ్టీ 11,400-11,380 స్థాయి వద్ద కొత్తగా లాంగ్‌పోజిషన్‌లను తీసుకోవచ్చు. ఎగువన

అత్యంత విలువైన బ్రాండ్‌గా ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌’

Saturday 28th September 2019

సమాచార సేవల సంస్థ డబ్ల్యూపీ జాబితాలో తొలిస్థానం ముంబై: దేశీ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. సమాచార సేవల సంస్థ డబ్ల్యూపీ రూపొందించిన భారత అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో ఈ బ్యాంకింగ్‌ సంస్థ 22.70 బిలియన్‌ అమెరికా డాలర్ల విలువతో తొలి స్థానాన్ని దక్కించుకుంది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ 20 బిలియన్‌ డాలర్ల విలువతో రెండవ స్థానంలో

Most from this category