News


ఆశించిన స్థాయిలో ఎఫ్‌ఎంసీజీ వృద్ధి ఉండకపోవచ్చు!

Saturday 31st August 2019
news_main1567249098.png-28133

గౌరవ్ గార్గ్

రానున్న రోజుల్లో ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) ఆశించిన స్థాయిలో వృద్ధిని సాధించకవపోవచ్చని ప్రముఖ అనలిస్టు గౌరవ్ గార్గ్ అంచనా వేస్తున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఎఫ్‌ఎంజీసీ నాలుగో అతిపెద్ద రంగం. వచ్చే ఏడాది నాటికి ఈ రంగం 27.86 శాతం సీఏజీఆర్‌ వృద్ధి రేటుతో 103.7 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐబీఈఎఫ్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ రంగం 2019 లో 11-12 శాతం వృద్ధి చెందుతుందని క్రిసిల్ నివేదిక తెలిపింది. ఎంఫ్‌ఎంసీజీ రంగం ఏటా ఆర్జించే మొత్తం ఆదాయంలో 45శాతం గ్రామీణ ప్రాంతం నుంచి అందుతుంది. సాదారణంగా ఈ రంగాన్ని ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌, హెల్త్‌కేర్‌, వ్యక్తిగత సంరక్షణ విభాగాలుగా వర్గీకరిస్తారు. పతంజలి ఉత్పత్తుల ప్రవేశంతో ఈ రంగానికి నూతనోత్సాహానివ్వడంతో పాటు మార్గదర్శకానిచ్చింది. గతేడాది సూపర్‌ మార్కెట్లు, హైపర్‌ మార్కెట్ల పంపిణి ఛానెల్‌ విభాగంలో మార్కెట్లో ఎఫ్‌ఎంసీజీ ఆధిపత్యం చెలాయించింది. అన్ని షాపింగ్‌ అవసరాలకు వన్‌స్టాప్ సొల్యూషన్ థీమ్‌కు డిమాండ్‌ పెరగడం, డిస్పోజల్‌ ఇన్‌కమ్‌ పెరుగుదల ఈ విభాగం వృద్ధికి దోహదపడ్డాయి. హెచ్‌యూఎల్‌, కోల్గేట్‌, డాబర్‌ లాంటి లార్జ్‌క్యాప్‌ ఎఫ్‌ఎంజీసీ కంపెనీల కిత్రం క్వార్టర్లో రెండంకెల వృద్ధి నమోదుచేశాయి. అలాగే ఈ రంగంలో ఈ కామర్స్‌ ద్వారా వచ్చే ఆదాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. 2016లో 0.4శాతం నమోదైన ఆదాయం, 2018 నాటికి 1.3శాతంగా నమోదయ్యాయి. 2030 నాటికి ఇది 11శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయ జనాభాలో మొత్తం 65శాతం మంది జనాభ గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. వారు తమ మొత్తం ఆదాయాల్లో 50శాతాన్ని కేవలం ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల మీద ఖర్చు చేస్తున్నారు. ఎఫ్‌ఎంసీజీ రంగం మొత్తం ఆదాయంలో 45 శాతం ఆదాయం వస్తున్న నేపథ్యంలో గ్రామీణ మార్కెట్‌ ఈ రంగ వృద్ధికి కీలకంగా మారింది.

ఇవే కారణమా?

వ్యవసాయంపై వచ్చే ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయాలనే ప్రభుత్వం లక్ష్యసాధనలో భాగంగా వ్యవసాయ ఉత్పాదక వ్యయాన్ని కనీసం 1.5రెట్లు పెంచడంతో పాటు పంటల కనీస మద్దతు ధర పెంపు ఈ రంగానికి ఇప్పడు ప్రధాన ఆటంకాలుగా మారాయి. వర్షపాతం సాదారణం శాతం కన్నా తక్కువగా నమోదు కాకపోవడం ఈ వృద్ధిని దెబ్బతీసింది. గ్రామీణ వాణిజ్యం ఎక్కువగా నగదు, టోకు విధానాల మీద ఆధారపడిన నేపథ్యంలో నోట్ల రద్దు, జీఎస్‌టీ లాంటి సంస్కరణలు ఈ రంగానికి ప్రతికూలంగా మారాయి. గతేడాదిలో ఈ రంగం సాధించిన 13శాతం వృద్ధితో పోలిస్తే ఈ ఏడాదిలో వృద్ధి 11-12 శాతంగానే మాత్రమే నమోదు కావచ్చని నీల్సన్‌ ఇండియా అంచనా వేసింది. 

ఈ రంగానికి చెందిన హెచ్‌యూఎల్‌, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, డాబర్‌, నెస్లే, మారికో లాంటి కంపెనీ షేర్లు గత ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని పంచాయి. ఆయా కంపెనీ షేర్ల స‌మ్మిళిత వార్షిక వృద్ధి రేటు 10శాతం నుంచి 20శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే రానున్న కాలంలో సూక్ష్మ, స్థూల వ్యవస్థల్లో జరిగిన పరిణామాలు ఈ రంగం పనితీరును ప్రభావితం చేస్తాయని, గతంలో చూసినట్లుగా పనితీరు ఇకముందు పునరావృతం కాకపోవచ్చు మార్కెట్‌లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల మధ్య గ్రామీణ మార్కెట్లో తక్కువ వినియోగం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో మందగమనం మరింత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.You may be interested

ఈ నెల 1 నుంచి ఇవి మారాయి.. తెలుసా?

Sunday 1st September 2019

సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులను గమనించినట్టయితే..   ఇల్లు కొనుగోలు చేసే సమయంలో టీడీఎస్‌ ఒకటి ఉంటుందని తెలుసు కదా. అయితే, ఇకపై మీరు ఎంచుకునే క్లబ్‌ మెంబర్‌షిప్‌, కారు పార్కింగ్‌ వంటి వాటికి చేసే చెల్లింపులు కూడా టీడీఎస్‌ పరిధిలోకి వస్తాయి.  ప్రతీ అవసరానికి ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తున్నారా..? అయితే మరోసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక ఏడాదిలో నగదు ఉపసంహరణలు రూ.కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌

ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి సమయం

Saturday 31st August 2019

-మార్క్‌ మొబియస్‌ దీర్ఘకాలంలో ఇండియా వృద్ధి చెందుతుందని, కానీ పన్నుల పరంగా ఇక్కడ చాలా గందరళగోళం ఉందని మొబియస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ వ్యవస్థాపకుడు మార్క్ మొబియస్ అన్నారు. ఎఫ్‌పీఐలపై విధించిన అదనపు సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరిం‍చుకోవడం చాలా మంచి చర్యని అన్నారు. దీర్ఘకాలానికి గాను భారతదేశంలో  పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి సమయమని, తన పెట్టుబడుల జాబితాలో ఇండియా అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు. ‘భారతదేశ ఆర్థిక మందగమనానికి అంతర్గత, బాహ్య

Most from this category