News


జీఎస్‌టీ సరళీకరణతో ర్యాంక్‌ మెరుగుపరుస్తాం: నిర్మల

Friday 25th October 2019
news_main1571975085.png-29127

వస్తు, సేవల పన్నును మరింత సరళతరం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా నిర్దేశిత లక్ష్యమైన అగ్ర స్థాయి 50 దేశాల జాబితాలోకి చేరుకోవడానికి వీలుంటుందని వివరించారు. జీఎస్‌టీని సులభతరం చేయడం అనేది కొనసాగుతున్న ప్రక్రియ కాగా, ప్రస్తుతం రిటర్నుల ఆన్‌లైన్ ఫైలింగ్‌లో ఉన్నటువంటి అవాంతరాలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ, ముంబై నగరాలను ఆధారంగానే ప్రపంచ బ్యాంక్‌ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులను ఇస్తుందని.. వచ్చే రెండేళ్లలో బెంగళూరు, కోలకతా నగరాలు కూడా ఇండెక్స్‌ రూపకల్పనలోకి చేరనున్నట్లు వెల్లడించారు. ఇక వ్యాపార స్థాపన విభాగంలో ర్యాంక్‌ ఒక్క మెట్టు మాత్రమే పెరిగిందని, స్థాపన మరింత సులభతరం కావాల్సి ఉందన్న అంశంపై దృష్టిసారించామని వివరించారు. 



You may be interested

గ్యాప్‌అప్‌ ప్రారంభం

Friday 25th October 2019

అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా వున్నప్పటికీ, శుక్రవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 181 పాయింట్ల లాభంతో 39,201 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 63 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,646 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు రికార్డు లాభాల్ని ప్రకటించిన ఐటీసీ 2.5 శాతం గ్యాప్‌అప్‌తో మొదలుకాగా, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, ఐఓసీలు 1-2 శాతం మధ్య లాభపడ్డాయి. టెల్కోలకు సుప్రీంకోర్టు ఇచ్చిన షాక్‌ ఫలితంగా ఇన్‌ఫ్రాటెల్‌ ప్రారంభంలో

రిలయన్స్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ ఆఫర్‌

Friday 25th October 2019

పండుగల సీజన్‌ సందర్భంగా రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ పేరిట ఆఫర్‌ను ప్రకటించింది. అక్టోబర్‌ 25 నుంచి 31వరకు కొనసాగనున్న తాజా ఆఫర్‌లో టీవీలు, గృహోపరకణాలు, మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ వంటి ఎలక్ట్రానిక్స్‌పై 15 శాతం క్యాష్‌బ్యాక్‌ ఉండగా.. విడిభాగాలపైమరో 10 శాతం డిస్కౌంట్‌ ఉన్నట్లు వెల్లడించింది. లక్కీ కస్టమర్లకు కిలో బంగారం, లగ్జరీ కార్లు, మోటార్‌ సైకిళ్లు, ఎల్‌ఈడీ టీవీలు, ఐ-ఫోన్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆఫర్‌

Most from this category