STOCKS

News


రియల్టీ సమస్యలపై కేంద్రం దృష్టి

Monday 12th August 2019
news_main1565589552.png-27704

  • రియల్టర్లు, గృహ కొనుగోలుదారులతో ఆర్థిక మంత్రి భేటీ

న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఇటు రియల్టర్లు, అటు గృహ కొనుగోలుదారులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. నిధుల కొరత, డిమాండ్ మందగించడం, ప్రాజెక్టులు నిల్చిపోవడం తదితర సమస్యల గురించి వివరంగా చర్చించారు. తొలి సమావేశంలో రియల్టర్ల తరఫున పరిశ్రమ సమాఖ్యలైన క్రెడాయ్‌, నారెడ్కో ప్రతినిధులు పాల్గొన్నారు. నిధుల కొరత, అమ్మకాలు పడిపోవడం వంటి అంశాల కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని వారు వివరించారు. ప్రాజెక్టులకు రుణాలిచ్చేలా బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) సూచించాలంటూ మంత్రిని కోరారు. ఇక, ప్రాజెక్టుల జాప్యం కారణంగా 5 లక్షల మంది పైగా కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని మరో సమావేశంలో పాల్గొన్న  గృహాల కొనుగోలుదారుల ఫోరం ఎఫ్‌పీఎస్‌ఈ ప్రెసిడెంట్‌ అభయ్ ఉపాధ్యాయ్ తెలిపారు. నిల్చిపోయిన ప్రాజెక్టుల పూర్తి కోసం ప్రభుత్వం రూ. 10,000 కోట్ల స్ట్రెస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, గృహాల కొనుగోలుదారులకు ఊరటనివ్వాలని ఆయన కోరారు. "ఈ సమావేశాల్లో చాలా ఉపయోగకరమైన అంశాలను చర్చించడం జరిగింది. దీనితో రియల్ ఎస్టేట్ రంగాన్ని పీడిస్తున్న సమస్యల్లో కొన్నింటినైనా పరిష్కరించే ప్రక్రియ ప్రారంభమైంది" అని భేటీలో పాల్గొన్న గృహ, పట్టణ ప్రాంత వ్యవహారాల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి తెలిపారు. రెవెన్యూ, హౌసింగ్‌, పన్నుల విభాగం తదితర శాఖల అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. నిల్చిపోయిన ప్రాజెక్టులను గట్టెక్కించేందుకు ప్రత్యేక నిధిని రూపొందించేలా రాబోయే వారాల్లో ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఈ సందర్భంగా సంబంధిత వర్గాలు తెలిపాయి. You may be interested

ఆర్‌ఐఎల్‌ జేవీలో సౌదీ ఆరామ్‌కో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు

Monday 12th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐల్‌) ఆయిల్‌ అండ్‌ కెమికల్‌ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కో ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ ఆయిల్‌, పెట్రోకెమికల్స్‌ వ్యాపారాన్ని ఆర్‌ఐఎల్‌ విభజించి ఏర్పాటుచేసే జాయింట్‌వెంచర్‌ విలువను రూ. 5.32 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. ఇందులో సౌదీ ఆరామ్‌కో 20 శాతం వాటా కొనుగోలుకు రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ఈ మేరకు ఒప్పందంపై అరామ్‌కోతో సంతకాలు చేయనున్నట్లు సోమవారం జరిగిన ఆర్‌ఐఎల్‌ వార్షిక సర్వసభ్య సమావేశం

బాకీల వసూలు వేటలో బీఎస్‌ఎన్‌ఎల్‌

Monday 12th August 2019

రూ. 3,000 కోట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుతం కార్పొరేట్ క్లయింట్ల నుంచి బాకీల వసూళ్ల పనిలో పడింది. దాదాపు రూ. 3,000 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిల్లో సింహభాగం మొత్తాన్ని వచ్చే రెండు, మూడు నెలల్లో వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తోంది. కంపెనీ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు వెల్లడించారు. బీఎస్ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాలను

Most from this category