News


అన్ని కంపెనీలకు 25%కార్పొరేట్‌ టాక్స్‌ వర్తింపు!

Wednesday 24th July 2019
news_main1563957514.png-27281

సంకేతాలిచ్చిన ఆర్థిక మంత్రి
బడ్జెట్లో ప్రకటించిన 25 శాతం కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపును అన్ని కంపెనీలకు వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సంకేతాలిచ్చారు. ఈ నెల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పలు కంపెనీలకు కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు వరాన్ని ప్రకటించిన ఆర్థిక మంత్రి కొన్ని బడా కంపెనీలను మాత్రం మినహాయించారు. కంపెనీల్లో దాదాపు 99.3 శాతాన్ని 25 శాతం రేటు పరిధిలోకి తెచ్చామని ఆమె రాజ్యసభలో వెల్లడించారు. దీంతో కేవలం కొన్ని మాత్రమే ఈ టాక్స్‌కు బయట ఉన్నాయని, వీటిని కూడా త్వరలో 25 శాతం పన్ను పరిధిలోకి తెస్తామని బడ్జెట్‌పై చర్చలో చెప్పారు. కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపు 2014లో తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ అని, దీన్ని అమలు చేశామని వివరించారు. 

బడ్జెట్‌బిల్లుకు తాజాగా పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. సంపద పునర్‌వ్యవస్థీకరణ ఆశయంతోనే పన్నులుంటాయని ప్రభుత్వం పేర్కొంది. వార్షిక టర్నోవర్‌ రూ. 400 కోట్ల వరకు ఉన్న కంపెనీలకు కార్పొరేట్‌ టాక్స్‌ను 30 నుంచి 25 శాతానికి బడ్జెట్లో తగ్గించారు. ఇదివరకు 25 శాతం రేటు రూ. 250 కోట్ల వార్షిక టర్నోవర్‌ ఉన్న కంపెనీలకే వర్తించేదని, ఈ పరిమితిని పెంచుతున్నామని మంత్రి బడ్జెట్లో చెప్పారు. ప్రస్తుతం ఇండియా ఇంక్‌లో 0.7 శాతం కంపెనీలు మాత్రమే ఈ పరిధికి బయట ఉన్నాయి. ఇవన్నీ పెద్ద కంపెనీలు. వీటిని కూడా క్రమంగా ఇదే పరిధిలోకి తెస్తామని మంత్రి చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సమస్య తీర్చే చర్యలు తీసుకుంటున్నామని కూడా ఆమె తెలిపారు. పెట్రో ఉత్పత్తులపై లెవీ విధింపును ఆమె సమర్థించుకున్నారు. 



You may be interested

టాటా మోటర్స్‌ 3 శాతం పతనం..

Wednesday 24th July 2019

టాటా మోటర్స్‌ రేటింగ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ బీబీ నుంచి బీబీ మైనస్‌కు తగ్గించడంతో బుధవారం మధ్యహ్నాం 2.17 సమయానికి ఈ షేరు విలువ 2.85 శాతం నష్టపోయి రూ. 151.75 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 49.55 పాయింట్లు కోల్పోయి 11,281.50 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. టాటా మోటర్స్‌ లాభదాయకత, ద్రవ్యలభ్యత ఆందోళన కారణంగా రేటింగ్‌ను తగ్గించామని ఫిచ్‌ వివరించింది. జెఎల్‌ఆర్‌(జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌)

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం క్రాష్‌

Wednesday 24th July 2019

స్టాక్‌ మార్కెట్‌ వరుస పతనంలో భాగంగా బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం మరో 1శాతం నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 29,085.45 వద్ద ప్రారంభమైంది. నేటి ఇంట్రాడేలో బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనంతో 257 పాయింట్లు నష్టపోయి(0.85శాతం) 29000 స్థాయిని కోల్పోయి 28,871.00 వద్దకు క్షీణించింది. తదుపరి కాస్త రివకరీని సాధించి మిడ్‌సెషన్‌ కల్లా తిరిగి 29000 స్థాయిని తిరిగి అందుకుంది.

Most from this category