News


ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌ల్లో బాండ్ల లిస్టింగ్‌కు బూస్ట్‌

Sunday 2nd February 2020
news_main1580618374.png-31430

  • విత్‌హోల్డింగ్‌ పన్ను 4 శాతానికి తగ్గింపు

ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌లో బాండ్ల లిస్టింగ్‌ను ‍ప్రోత్సహించేందుకు.. ఈ బాండ్ల వడ్డీ చెల్లింపులపై విత్‌హోల్డింగ్స్‌ ట్యాక్స్‌(ముందస్తుగా వసూలు చేసే పన్ను)ను 5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ చర్య మరింత మంది అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఐఎఫ్‌ఎస్‌సీ ఎక్సేంజ్‌లోని బాండ్లలో పెట్టుబడులు పెట్టే దిశగా ప్రోత్సహించనుంది. ఈ చర్య బాండ్లను జారీ చేసే కంపెనీలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని, మరింత మంది అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షించగలవని ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్సేంజ్‌ (ఇండియా ఐఎన్‌ఎక్స్‌) ఎండీ, సీఈవో వి.బాలసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్‌కు వడ్డీ లేదా డివిడెండ్‌ చెల్లింపులపై విత్‌హోల్డింగ్‌ ట్యాక్స్‌ను దేశాలు వసూలు చేస్తుంటాయి. 



You may be interested

కొత్త విధానంలో పన్నుభారం ఇలా పెరుగుతుంది

Sunday 2nd February 2020

దీర్ఘకాలిక పొదుపు అలవాటుపై ప్రతికూల ప్రభావం ఆర్థికమంత్రి చర్యలను తప్పుపడుతున్న ట్యాక్స్‌ నిపుణులు సాక్షి, అమరావతి: కొత్త పన్నుల విధానంలో పన్ను రేట్లు తగ్గించడం వల్ల పన్ను భారం భారీగా తగ్గుతుందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయం కోల్పోంతుందన్న మాటల్లో వాస్తవం లేదని ట్యాక్సేషన్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కీలకమైన పన్ను మినహాయింపులను ఎత్తివేయడం వల్ల ప్రజల్లో పొదుపు అలవాటుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. పన్ను భారం తగ్గించుకోవడానికి చాలామంది

బడ్జెట్‌ రియల్టీ : అందుబాటు తప్ప.. అందినదేమీ లేదు!

Sunday 2nd February 2020

– రూ.1.5 లక్షల వడ్డీ రాయితీ గడువు మరొక ఏడాది పొడిగింపు – అఫడబుల్‌ డెవలపర్లకు లాభాల మీద పన్నుకు కూడా.. – కొత్త ఎయిర్‌పోర్ట్స్, లాజిస్టిక్‌ పాలసీలతో కమర్షియల్‌ రియల్టీకి డిమాండ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మళ్లీ పాత పాటే పడింది. జీఎస్‌టీ తగ్గింపు, మౌలిక రంగ హోదా, ఇన్వెంటరీ గృహాలకు పన్ను మినహాయింపు, డెవలపర్స్‌ సబ్‌వెన్షన్, కొనుగోలుదారుల ఫిర్యాదు కోసం రెరా సింగిల్‌ బాడీ ఏర్పాటు వంటి

Most from this category