News


సీసీఐ విచారణ ఆదేశాలు కొట్టివేయండి

Saturday 22nd February 2020
news_main1582341834.png-31994

  • కర్ణాటక హైకోర్టుకు ఫ్లిప్‌కార్ట్‌

న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తమపై విచారణ జరపాలంటూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ఈ-కామర్స్ సంస్థ ఫ్లి్ప్‌కార్ట్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) చేసిన ఆరోపణలే ప్రాతిపదికగా, ఎలాంటి ప్రాథమిక ఆధారాలేమీ లేకుండానే సీసీఐ తమపై దర్యాప్తుకు ఆదేశించిందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. వివరాల్లోకి వెడితే.. ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు .. భారీ డిస్కౌంట్లు, ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలతో పోటీని దెబ్బతీస్తున్నాయని సీఏఐటీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి సీసీఐ విచారణకు ఆదేశించింది. అయితే, దీనిపై స్టే విధిస్తూ కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. తాజాగా దర్యాప్తు ఆదేశాలను పూర్తిగా తోసిపుచ్చాలంటూ ఫ్లిప్‌కార్ట్ న్యాయస్థానాన్ని కోరింది. 



You may be interested

జీఎంఆర్‌ డీల్‌కు సీసీఐ ఆమోదం

Saturday 22nd February 2020

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ ఏడీపీకి జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారంలో వాటాల విక్రయానికి సంబంధించిన డీల్‌కు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌ (జీఏఎల్‌)లో 49 శాతం, జీఎంఆర్ ఇన్‌ఫ్రా సర్వీసెస్‌లో 100 శాతం వాటాల కొనుగోలుకు  గ్రీన్ చానల్ విధానంలో గ్రూప్ ఏడీపీ దరఖాస్తు చేసుకుందని సీసీఐ పేర్కొంది. ఈ విధానంలో వచ్చిన దరఖాస్తులన్నీ ఆమోదం పొందినవాటిగా పరిగణిస్తారు. ఈ డీల్ విలువ రూ. 10,780

అమెరికా టాప్‌ 20లో టీసీఎస్‌..

Saturday 22nd February 2020

న్యూయార్క్‌: అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అత్యుత్తమమైన టాప్ 20 సంస్థల జాబితాలో దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ చోటు దక్కించుకుంది. పలు అమెరికన్ మెగా కంపెనీల సరసన నిల్చిన భారతీయ కంపెనీ ఇదొక్కటే కావడం గమనార్హం. 2020 ఏడాదికి గాను ఫార్చూన్‌ రూపొందించిన బెస్ట్ బిగ్ కంపెనీస్ టు వర్క్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్చున్ జాబితాలో చోటు దక్కించుకోవడంపై టీసీఎస్ ప్రెసిడెంట్ (ఉత్తర అమెరికా, యూకే, యూరప్‌)

Most from this category