News


ఫ్లిప్‌కార్ట్‌లో ఇక సినిమాలు కూడా..

Tuesday 6th August 2019
news_main1565071951.png-27566

  •  వీడియో స్ట్రీమింగ్ సేవలపై సంస్థ కసరత్తు
  • ప్రాంతీయ భాషల్లో త్వరలో అందుబాటులోకి

న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొనే దిశగా వాల్‌మార్ట్‌ సారథ్యంలోని ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే ప్రాంతీయ భాషల్లో వీడియో స్ట్రీమింగ్ సేవలు కూడా అందుబాటులోకి తేనున్నట్లు సోమవారం ప్రకటించింది. 'ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌' పేరిట ఈ సర్వీసు ప్రారంభించనుంది. ప్రకటనల ఆదాయంతో నిర్వహించే ఈ సర్వీసు.. ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఉపయోగించే యూజర్లకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. షార్ట్ ఫిలిమ్‌లు, పూర్తి నిడివి సినిమాలు, సిరీస్‌లు మొదలైనవి ఫ్లిప్‌కార్ట్ వీడియోస్‌లో ఉంటాయి. పండుగ సీజన్‌ రానున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. "ఈ సేవలపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. షాపింగ్‌ కోసమే కాకుండా మా ప్లాట్‌ఫాంపై యూజర్లు మరింత సమయం వెచ్చించేలా చేయాలని యత్నిస్తున్నాం" అని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి చెప్పారు. ముందుగా హిందీతో ప్రారంభించి తర్వాత దశల్లో తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా కంటెంట్ అందించనున్నట్లు వివరించారు.  అమెజాన్ ఇప్పటికే 'ప్రైమ్'  సర్వీస్ కింద వీడియో, మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫీజు వార్షికంగా రూ. 999 కాగా నెలకు రూ. 129గా ఉంది. 



You may be interested

రుణాలపై రేట్ల సమీక్షకు బ్యాంకర్లు అంగీకారం

Tuesday 6th August 2019

రుణాలపై రేట్ల సమీక్షకు బ్యాంకర్లు అంగీకారం న్యూఢిల్లీ: ఆర్‌బీఐ రేట్ల తగ్గింపు ప్రయోజనాలను రుణ గ్రహీతలకు బ్యాంకులు పూర్తి స్థాయిలో అందించని పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకర్లతో సోమవారం చర్చించారు. రుణ రేట్లను సమీక్షించేందుకు బ్యంకర్లు అంగీకారం తెలిపారు. గత డిసెంబర్‌ నుంచి ఆర్‌బీఐ ఇప్పటి వరకు 75 బేసిస్‌ పాయింట్ల మేర రుణ రేట్లను తగ్గించినప్పుటికీ, ఆ స్థాయిలో రుణాలపై రేట్లు తగ్గని విషయం

ఇండియన్‌ బ్యాంకు ఆకర్షణీయ ఫలితాలు

Tuesday 6th August 2019

చెన్నై: ప్రభుత్వరంగ ఇండియన్‌బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.209 కోట్లతో పోలిస్తే 75 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం కూడా రూ.5,132 కోట్ల నుంచి రూ.5,832 కోట్లకు వృద్ధి చెందింది. జూన్‌ త్రైమాసికంలో తాజాగా రూ.1,035 కోట్లు మొండి బకాయిలుగా మారాయి. అన్ని విభాగాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు ఇండియన్‌ బ్యాంకు

Most from this category