STOCKS

News


కొత్త కస్టమర్లను చేరుకోవడమే లక్ష్యం

Tuesday 25th June 2019
news_main1561439498.png-26554

  • కొత్త కస్టమర్లను చేరుకోవడమే లక్ష్యం

ఐపీవో దీర్ఘకాలిక విధానంలో భాగం: ఫ్లిప్‌కార్ట్‌ న్యూఢిల్లీ: వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ప్రస్తుతం తమ దృష్టి అంతా 20-30 కోట్ల మంది భారతీయులను కొత్తగా ఈ -కామర్స్‌ వైపు తీసుకురావటంపైనే ఉందని స్పష్టంచేసింది. ఐపీవోకు రావడం అన్నది తమ ఆకాంక్ష అని, కంపెనీ దీర్ఘకాల వ్యూహంలో ఇది భాగమే అయినప్పటికీ ప్రస్తుతమైతే దీనికి కాలపరిమితి లేదని పేర్కొంది. 2022 నాటికి అమెరికా ఈక్విటీ మార్కెట్లోకి ఫ్లిప్‌కార్ట్‌ అడుగుపెట్టనుందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ నుంచి ఈ ప్రకటన విడుదలైంది. భారత్‌లో భారీ అవకాశాలు ఉన్నాయని, ఇక్కడి మార్కెట్‌ విషయంలో తమ ప్రణాళికలకు కట్టుబడి ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది. 
ఫ్లిప్‌ర్ట్‌లో బిన్నీ వాటా కొంత అమ్మకం
బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్నీ బన్సల్‌ కంపెనీలో తన వాటాల నుంచి 5.39 (0.33శాతం) లక్షల షేర్లను విక్రయించారు. వాల్‌మార్ట్‌కు చెందిన ఫిట్‌ హోల్డింగ్స్‌ ఎస్‌ఏఆర్‌ఎల్‌ ఈ వాటాలను కొనుగోలు చేసింది. ఈ వాటాల విలువ రూ.531 కోట్లు (76.4 మిలియన్‌ డాలర్లు). బన్సల్‌ తన వాటాల నుంచి 5,39,912 ఈక్విటీ షేర్లను వాల్‌మార్ట్‌ కంపెనీకి విక్రయించినట్టు నియంత్రణ సంస్థలకు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. మరో వ్యవస్థాపకుడైన సచిన్‌ బన్సల్‌, వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన సమయంలోనే తన వాటాలను పూర్తిగా విక్రయించి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజా వాటాల అమ్మకం తర్వాత కూడా ఫ్లిప్‌కార్ట్‌లో బిన్సీ బన్సల్‌కు 3.52 శాతం మిగిలి ఉంటుందని అంచనా. 



You may be interested

గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి

Tuesday 25th June 2019

30 లక్షల నకిలీ బిజినెస్‌ ప్రొఫైల్స్‌ తొలగింపు న్యూఢిల్లీ: గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి  30 లక్షల నకిలీ బిజినెస్‌ ప్రొఫైల్స్‌ను గత ఏడాది గూగుల్‌ తొలగించింది. వీటిల్లో దాదాపు 90 శాతం బిజినెస్‌ ప్రొఫైల్స్‌ను, యూజర్లు చూడకముందే తొలగించామని గూగుల్‌ మ్యాప్స్‌ ప్రొడక్ట్‌ డైరెక్టర్‌ ఈథన్‌ రస్సెల్‌ ఒక బ్లాగ్‌స్పాట్‌లో తెలిపారు. ఒక వ్యాపార సంస్థ కాంటాక్ట్‌ వివరాలను, ఆ సం‍స్థకు చేరుకోవలసిన మార్గాల గురించి గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా యూజర్లు

ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల్లో 60 శాతం పెరుగుదల

Tuesday 25th June 2019

న్యూఢిల్లీ: జాతీయ బ్యాంకుల్లో ఈ ఏడాది మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు 60 శాతం పెరిగి 8,582 మంది ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య 5,349 మంది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించని వారిని/సంస్థలను

Most from this category