News


ఫ్లిప్‌కార్ట్‌ సిబ్బందికి ఎన్‌ఎస్‌డీసీ శిక్షణ

Tuesday 13th August 2019
news_main1565676625.png-27732

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో (ఎన్‌ఎస్‌డీసీ) ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 20,000 మంది డెలివరీ సిబ్బందికి ఎన్‌ఎస్‌డీసీ విభాగమైన లాజిస్టిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ శిక్షణ ఇవ్వనుంది. సరుకు రవాణా విధానం, స్థానిక రవాణా చట్టాలు, నిబంధనలు, కస్టమర్లతో ప్రవర్తించే తీరు వంటి అంశాల్లో సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. 



You may be interested

ముకేశ్‌.. మెగా డీల్స్‌

Tuesday 13th August 2019

కంపెనీలోకి రూ. 1.15 లక్షల కోట్లు చమురు రిఫైనరీ, రిటైల్‌లో వాటా విక్రయం సౌదీ ఆరామ్‌కో చేతికి 20 శాతం వాటా ఇంధన రిటైలింగ్‌లో బ్రిటన్‌ బీపీకి 49 శాతం ఏడాదిన్నరలో రుణ రహిత కంపెనీగా ఆవిర్భావం సెప్టెంబర్‌ 5 నుంచి జియో ఫైబర్‌ సేవలు  అయిదేళ్లలో ఐపీవోకి జియో, రిటైల్‌ చమురు నుంచి టెలికం దాకా వివిధ రంగాల్లో విస్తరించిన పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా మరిన్ని భారీ వ్యాపార ప్రణాళికలు ప్రకటించింది. ఏడాదిన్నర వ్యవధిలో

మరింతగా పెరిగిన జీవీకే పవర్‌ నష్టాలు

Tuesday 13th August 2019

జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ నికర నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రెట్టింపునకు మించి పెరిగాయి.  గత క్యూ1లో రూ.55 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.132 కోట్లకు పెరిగాయని జీవీకే పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,106 కోట్ల నుంచి రూ.1,042 కోట్లకు తగ్గిందని పేర్కొంది. జీవీకే కంపెనీ.. ఇంధన, విమానాశ్రయాలు, రవాణా, ఆతిధ్య, జీవ శాస్త్రాల

Most from this category