News


ఫ్లిప్‌కార్ట్‌కు ఓటీపీ అవసరం లేదు..

Tuesday 7th January 2020
news_main1578368482.png-30717

  • రూ. 2,000 వరకు పరిమితి
  • వీసా సేఫ్‌ క్లిక్‌ పేరిట సేవలు

న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌.. తాజాగా వన్‌ టైమ్‌ పాస్‌వార్డ్‌ (ఓటీపీ) అవసరం లేని చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. చిన్న మొత్తాల్లో కొనుగోలు చేసేవారి చెల్లింపులను సులభతరం చేయడంలో భాగంగా.. ‘వీసా సేఫ్‌ క్లిక్‌’ పేరిట సేవలను ప్రారంభించినట్లు సోమవారం ప్రకటించింది. రూ. 2,000 వరకు పూర్తి భద్రతతో ఓటీపీ లేకుండా ఈ విధానంలో చెల్లించవచ్చని ఫ్లిప్‌కార్ట్ హెడ్ రంజిత్ బోయనపల్లి వివరించారు. ఓటీపీ రాకపోవడం వల్ల కొనుగోళ్లను ఆపివేస్తున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిందని, ఇటువంటి సమస్య లేకుండా ఉండేందుకు నూతన సేవలు సహకరిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. 



You may be interested

నిఫ్టీ 86 పాయింట్లు, సెన్సెక్స్‌ 307 పాయింట్లు అప్‌

Tuesday 7th January 2020

అమెరికా-ఇరాన్‌ సంక్షోభంతో క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో జోరుగా పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 307 పాయింట్ల లాభంతో 40,984 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 86 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,079 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. గత రాత్రి అమెరికా మార్కెట్‌ పాజిటివ్‌గా ముగియడంతో, తాజాగా ఆసియా సూచీలు సైతం రిబౌండ్‌కావడం.. ఇక్కడి ప్రారంభర్యాలీకి కారణమయ్యింది. అలాగే పసిడి ధర 1,560

ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..?

Tuesday 7th January 2020

కార్పొరేట్ దిగ్గజాలతో ప్రధాని మోదీ భేటీ ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చ న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌, అదానీ గ్రూప్

Most from this category