STOCKS

News


ఫ్లిప్‌కార్ట్‌లో మాతృసంస్థ భారీ పెట్టుబడి

Thursday 12th September 2019
news_main1568259461.png-28323

  • సింగపూర్‌ సంస్థ నుంచి రూ.1,616 కోట్లు

వాల్‌మార్ట్‌కు చెందిన భారత ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ఈ పండుగల సీజన్‌ కోసం తన మాతృసంస్థ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడిని అందుకుంది. సింగపూర్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌.. ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలో రూ.1,616 కోట్లును పెట్టుబడిగా పెట్టినట్లు రిజిస్ర్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ)కి ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఇందుకోసం భారత సంస్థ తనకు 4,64,403 ఈక్విటీ షేర్లను (ఒక్కో షేరు విలువ రూ.34,800) జారీ చేసినట్లు పేర్కొంది. ఈఏడాది జనవరిలో రూ.1,431 కోట్లను పెట్టుబడి పెట్టగా.. ఇది ప్రస్తుత ఏడాదిలో రెండో విడత పెట్టుబడిగా వెల్లడించింది.You may be interested

కంపెనీల బోర్డుల్లో యువతకు చోటేది?

Thursday 12th September 2019

50 ఏళ్లలోపు సభ్యులు 7 శాతమే బోర్డు సభ్యుల సగటు వయసు 63 అనుభవానికే పెద్ద పీట యువతకు మొండి చేయి అంతర్జాతీయంగానూ ఇవే పరిస్థితులు సీఎల్‌ఎస్‌ఏ నివేదికలో ఆలోచింపజేసే అంశాలు యువ జనాభా అత్యధికంగా కలిగిన భారత్‌ భవిష్యత్తు ఆర్థిక దిగ్గజంగా తప్పకుండా అవతరిస్తుందని ఎంతో మంది విశ్వసిస్తు‍న్నారు. దేశ ఉత్పాదకతను పెంచేందుకు యువతరం మన విలువైన సొత్తు. కానీ, యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కీలకమైన కార్పొరేట్‌ కంపెనీల బోర్డుల్లో మాత్రం... యువ నిపుణులకు తగిన

ఈనెల్లోనే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌ సేల్‌

Thursday 12th September 2019

సెప్టెంబర్‌ 29న ప్రారంభం న్యూఢిల్లీ: పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌.. ఈనెలాఖరులోనే మరోసారి 'ది బిగ్ బిలియన్ డేస్‌' సేల్ ఆఫర్‌ను ప్రారంభించనుంది. ఆరు రోజులపాటు కొనసాగే తాజా ఆఫర్‌.. సెప్టెంబర్‌ 29న ప్రారంభమై అక్టోబర్ 4 వరకు ఉంటుందని సంస్థ ప్రకటించింది. గతంలో కంటే అధిక వస్తువులను ఈసారి ఆఫర్‌లో ఉంచనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఇందుకోసం అనేక బ్రాండ్లు, ఎంఎస్‌ఎంఈ, విక్రయదారులతో ఇప్పటికే ఒప్పందంకుదిరినట్లు తెలియజేసింది.

Most from this category