News


ఫ్లిప్‌కార్ట్‌ నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లు

Tuesday 10th September 2019
news_main1568091760.png-28280

  • పండుగల సీజన్‌ ముందు సరఫరా పటిష్టంపై దృష్టి

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ తన సరఫరా వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించింది. పండుగల సీజన్‌ నేపథ్యంలో అధిక సంఖ్యలో వచ్చే ఆర్డర్లను అంతే వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తన నెట్‌వర్క్‌లోకి 27,000 కిరాణా స్టోర్లను చేర్చుకుంది. దీంతో మరిన్ని ప్రాంతాలకు, కస్టమర్లను చేరుకోవడం కంపెనీకి వీలు పడుతుందని, అదే సమయంలో కిరాణా స్టోర్లకు ఆదాయం పెరుగుతుందని ఫ్లిప్‌కార్ట్‌ తన ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా రానున్న బిగ్‌ బిలియన్‌ డేస్‌ కార్యక్రమంలో లక్షలాది మంది కొత్త కస్టమర్లను చేరుకోవడానికి సాయపడుతుందని పేర్కొంది. ‘‘ఆరు నెలల క్రితమే దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్ల చేరిక మొదలైంది. రానున్న పండుగల సీజన్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలను దృష్టిలో ఉంచుకునే ఈ చర్యలు తీసుకున్నాం. దేశవ్యాప్తంగా వినియోగదారుల నుంచి డిమాండ్‌ పెరిగేందుకు, కిరాణా స్టోర్ల ఆదాయం పెరిగేందుకు ఇది దారితీస్తుంది’’అని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌కు ఇప్పటికే భారీ సరఫరా వ్యవస్థ ఉంది. నిత్యం 10 లక్షల షిప్‌మెంట్లను ఈ సంస్థ కస్టమర్లకు డెలివరీ చేస్తోంది. ‘‘కిరాణా స్టోర్లు అన్నవి దేశంలో ఎంతో కాలం నుంచి ఉన్న రిటైల్‌ విధానం. డిజిటల్‌ చెల్లింపుల అనంతరం, కిరణాలో తదుపరి విప్లవం ఈ కామర్స్‌తో అనుసంధానించడమే’’ అని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి అన్నారు. 



You may be interested

హైదరాబాద్‌ వద్ద ఇన్నోలియా ప్లాంటు

Tuesday 10th September 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: పునరుత్పాదక ఇంధన రంగంలోని యూఎస్‌ కంపెనీ ఇన్నోలియా ఎనర్జీ హైదరాబాద్‌ వద్ద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రూ.225 కోట్ల వ్యయంతో చౌటుప్పల్‌ వద్ద నెలకొల్పిన ఈ కేంద్రం సామర్థ్యం 300 మెగావాట్లు. సోలార్‌, లిథియం బ్యాటరీ, ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ రంగానికి అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. 

బీమా వ్యాపారాలను ఏం చేస్తారు

Tuesday 10th September 2019

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనంతో చిక్కు! 10 పీఎస్‌బీలను విలీనం చేయనున్న కేంద్రం వీటిల్లో పలు బ్యాంకులకు బీమా వ్యాపారాలు విలీనానంతర బ్యాంకుకు ఒకటికి మించిన కంపెనీల్లో వాటాలు నిబంధనల ప్రకారం ప్రమోటర్‌గా ఒక కంపెనీకే ఒక సంస్థలో వాటాలు విక్రయించడం లేదంటే రెండింటిలోనూ మైనారిటీ వాటాలు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మధ్య మెగా విలీనానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, ఆయా బ్యాంకులు నిర్వహిస్తున్న బీమా, ఇతర ఆర్థిక వ్యాపారాల పరిస్థితి ఏంటన్న సందేహం తలెత్తుతోంది. 10 ప్రభుత్వరంగ బ్యాంకులను

Most from this category