News


అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు

Saturday 21st December 2019
news_main1576899200.png-30343

  • అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు
  • ఎగుమతిదారులకు కేం‍ద్ర మంత్రి పియుష్ గోయల్‌ హామీ

న్యూఢిల్లీ: టారిఫ్‌యేతర ఆంక్షలు విధిస్తూ, భారత్‌ నుంచి ఎగుమతులకు అవరోధాలు సృష్టిస్తున్న దేశాల పేర్లు చెప్పాలని వ్యాపారవేత్తలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. అలాంటి దేశాలపై కచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ ఈ విషయాలు తెలిపారు. ఏ ఒక్కరి విషయంలోనో కాకుండా అందరికీ ప్రయోజనాలు కలిగేలా సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలన్నది తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. "ఏ దేశమైనా మీ ఎగుమతులపై టారిఫ్‌యేతర ఆంక్షలు విధించడం గానీ.. ఇతరత్రా అవరోధాలు గానీ సృష్టించడం గానీ చేస్తుంటే ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది. ఆయా దేశాలపై అదే తరహా వాణిజ్యపరమైన ఆంక్షలతో తగు చర్యలు తీసుకుంటుంది" అని గోయల్ తెలిపారు. ఎగుమతులు వరుసగా నాలుగో నెల నవంబర్‌లో కూడా క్షీణించి 0.34 శాతం మేర పడిపోయిన నేపథ్యంలో గోయల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వాస్తవ పరిస్థితులు మీరే చెప్పండి ...
"మా అధికారులు నాకు చెప్పేవన్నీ.. అంతా బాగానే ఉందనే అభిప్రాయం కలిగేలా ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తుంటే కచ్చితంగా అలా ఉన్నట్లు అనిపించడం లేదు. కాబట్టి వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా లేదా.. సమస్యలేమైనా ఉన్నాయా.. వాస్తవ పరిస్థితులను మీరే ప్రభుత్వానికి తెలియజేయండి. నేను, మా అధికారులు మీకు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటాం" అని గోయల్ చెప్పారు.పలు సమస్యలకు పరిష్కారాలు కనుగొనడానికి .. ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 

ఎవరి అభిప్రాయాలు వారివి...
ప్రభుత్వ విధానాలను విమర్శించే దమ్మెవరికీ లేకుండా పోయిందని, భయాందోళనలకు గురి చేసే వాతావరణం నెలకొందని పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలపై గోయల్ స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే, తమ ప్రభుత్వం ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తుందని, అందరి అభిప్రాయాలనూ వింటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో.. ప్రజలు, పరిశ్రమవర్గాల నుంచి మరింతగా తెలుసుకోవాలనుకుంటోందని అసోచాం  కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. You may be interested

పన్ను ఎగవేతదారులను పట్టుకోండి

Saturday 21st December 2019

లక్ష్యాన్ని చేరుకోండి అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్దేశం న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలో లక్ష్యం మేరకు పన్నుల ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు అనుసరించాల్సిన మార్గాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది. పన్నుల ఎగవేతదారులను డేటా అనలైటిక్స్‌ సాయంతో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ ఢిల్లీలో సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌భూషణ్‌ పాండే అధ్యక్షత వహించారు. అధిక ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌

స్పెక్ట్రం వేలానికి లైన్ క్లియర్‌

Saturday 21st December 2019

మార్చి-ఏప్రిల్‌లో నిర్వహణ రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వ్ ధర డీసీసీ ఆమోదముద్ర న్యూఢిల్లీ: దాదాపు రూ. 5.22 లక్షల కోట్ల రిజర్వ్ ధరతో స్పెక్ట్రం వేలం ప్రణాళిక ఖరారైెంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) శుక్రవారం దీనికి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం 22 సర్కిళ్లలో 8,300 మెగాహెట్జ్ స్పెక్ట్రంను మార్చి-ఏప్రిల్‌లో వేలం వేయనున్నారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకు డీసీసీ ఈ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు టెలికం

Most from this category