News


బ్యాంకింగ్‌లో మరిన్ని రుణాల రైటాఫ్

Friday 6th December 2019
news_main1575603579.png-30084

  • కేటాయింపులు పెరగడం,
  • రికవరీ బలహీనంగా ఉండటమే కారణం
  • ఫిచ్‌ రేటింగ్స్ నివేదిక

న్యూఢిల్లీ: దేశీ బ్యాంకులు మరిన్ని రుణాలను రైటాఫ్ (ఖాతాల నుంచి తొలగింపు) చేయాల్సి రావొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ గురువారం పేర్కొంది. మొండిబాకీలకు జరపాల్సిన కేటాయింపుల పరిమాణం పెరుగుతుండటం, బాకీల రికవరీ అవకాశాలు బలహీనంగా ఉండటం వంటి అంశాలే ఇందుకు కారణమని వివరించింది. మొండిబాకీల్లో సుమారు 90 శాతం భాగం ప్రభుత్వ రంగ బ్యాంకులదే (పీఎస్‌బీ) ఉంటోంది. గడిచిన మూడేళ్లలో మొత్తం 30 బిలియన్ డాలర్ల రుణాలను పీఎస్‌బీలు రైటాఫ్ చేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దేశీ బ్యాంకుల రుణ వృద్ధి బలహీనంగా ఉండటంతో పాటు గత మొండిబాకీల పరిష్కార ప్రక్రియ మందకొడిగా సాగుతోందని ఫిచ్ తెలిపింది. అయితే, రుణ సంబంధ వ్యయాలు తగ్గడంతో 2017-18 తర్వాత తొలిసారిగా బ్యాంకింగ్ రంగం లాభదాయకత మళ్లీ సానుకూలంగా కనిపిస్తోందని, పీఎస్‌బీలు నష్టాలు ప్రకటించినా.. గతంతో పోలిస్తే స్వల్పస్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. ప్రథమార్ధంలో రికవరీలను మించి రైటాఫ్‌లు నమోదైనట్లు తెలిపింది. 2018-19లో రుణ వృద్ధి 11 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఇది 9 శాతానికి తగ్గినట్లు ఫిచ్ వివరించింది. రియల్‌ ఎస్టేట్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో నిధులపరమైన ఒత్తిళ్లు, ఎకానమీ మందగమనం తదితర అంశాల వల్ల బ్యాంకులు జాగ్రత్త వహించనున్నందున.. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రుణ వృద్ధి ఒక మోస్తరు స్థాయిలోనే ఉండవచ్చని తెలిపింది. "ఇప్పటిదాకా రిటైల్ రుణాల వృద్ధి భారీగా ఉంది. అయితే, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ దిగజారిన పక్షంలో బ్యాంకులు మరింత జాగ్రత్తపడే అవకాశం ఉంది" అని పేర్కొంది.

రియల్టీ రుణాల పునర్‌వ్యవస్థీకరణ...
పెను సంక్షోభం ఎదుర్కొంటున్న రియల్టీ రంగంలో డిఫాల్టు రిస్కులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రంగ సంస్థల రుణాల పునర్‌వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఒక్కసారి వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని ఫిచ్ తెలిపింది. పెద్ద రియల్టీ సంస్థలు డిఫాల్టయితే.. ఆ ప్రభావం వాటికి రుణాలిచ్చిన ఎన్‌బీఎఫ్‌సీలపై నేరుగా పడుతుందని, తద్వారా మొత్తం వ్యవస్థపైనా ఉంటుందని వివరించింది. రియల్టీ రంగంలో సుమారు 65 బిలియన్ డాలర్ల మేర రుణాల పరిస్థితి బాగా లేదని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్ ఇటీవలే అంచనా వేసింది. You may be interested

జీఎస్‌టీ పరిధిలోకి ఏటీఎఫ్‌, గ్యాస్‌

Friday 6th December 2019

2020-21 బడ్జెట్లో ప్రతిపాదన..! న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), సహజ వాయువులను వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకుని వచ్చే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. ఈ రెండు కమోడిటీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న బహుళ పన్నుల భారాన్ని తగ్గించి, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం కోసం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రానున్న 2020-21 బడ్జెట్లో వీటిని జీఎస్‌టీలో భాగం చేసే

ఆర్‌బీఐకి సీఐసీ షోకాజ్ నోటీసు

Friday 6th December 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కేసులో విచారణకు హాజరు కానందుకే న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తనిఖీ నివేదికల వెల్లడి వివాదానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కి కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ అంశంపై విచారణకు హాజరు కావాలన్న తమ ఆదేశాలను ఆర్‌బీఐ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) తేలిగ్గా తీసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఉల్లంఘించినందున .. సమాచార హక్కు (ఆర్‌టీఐ)

Most from this category