News


వృద్ధి రేటు అంచనా 6.6 శాతానికి తగ్గింపు

Wednesday 11th September 2019
news_main1568174829.png-28300

  • వృద్ధి రేటు అంచనా 6.6 శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20) గతంలో వేసిన 6.8 శాతం నుంచి 6.6 శాతానికి రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ తాజాగా తగ్గించింది. అధిక రుణ భారం కారణంగా ద్రవ్య విధానాన్ని సడలించే అవకాశాలు ప్రభుత్వానికి పరిమితంగానే ఉన్నాయని ఈ సంస్థ అభిప్రాయపడింది. రానున్న సంవత్సరంలో భారత జీడీపీ 7.1 శాతానికి పుంజుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత రేటింగ్‌ను మార్పు చేయకుండా బీబీబీ మైనస్‌, స్థిరమైన దృక్పథాన్నే కొనసాగించింది. అధిక స్థాయిలో ప్రభుత్వ రుణం, ఆర్థిక రంగ సమస్యలు, కొన్ని నిర్మాణాత్మక అంశాలు వెనక్కి లాగుతున్నప్పటికీ... బలమైన విదేశీ మారక నిల్వలతో మధ్య కాలానికి వృద్ధి పరంగా మంచి అవకాశాలు ఉన్నాయని ఈ సంస్థ తెలిపింది. భారత జీడీపీ వృద్ధి వరుసగా ఐదో త్రైమాసిక కాలంలోనూ (ఏప్రిల్‌-జూన్‌) 5 శాతానికి తగ్గినట్టు ఫిచ్‌ తన ఆసియా పసిఫిక్‌ సార్వభౌమ క్రెడిట్‌ సమీక్ష నివేదికలో వివరించింది. ‘‘దేశీయ డిమాండ్‌ క్షీణిస్తోంది. ప్రైవేటు వినియోగం, ఇన్వెస్ట్‌మెంట్‌ బలహీనంగా ఉన్నాయి. అంతర్జాతీయ వాణిజ్య వాతావరణం కూడా బలహీనంగానే ఉంది’’ అని పేర్కొంది. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 11th September 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  సన్‌ఫార్మా:- రష్యాకు చెందిన పిజేఎస్సీ బయోసింటెజ్‌ కంపెనిలో తన మొత్తం వాటాను 100శాతానికి పెంచుకుంది. జేకే టెర్స్‌:- కంపెనీ డిప్యూటీ ఎండీగా అన్షుమాన్ సింఘానియా రాజీనామా చేశారు. టాటా మోటర్స్‌:- ఆగస్ట్‌లో జేఎల్‌ఆర్‌ రిటైల్‌ అమ్మకాలు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.7శాతం క్షీణించి 34,176 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌:- కంపెనీ అడిటర్‌ సంస్థగా బాస్కర్‌ అండ్‌ కో ని

పుత్తడి ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు

Wednesday 11th September 2019

-8 నెలల తర్వాత గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు  -పుత్తడి ధరలు పెరగడమే కారణం  -యాంఫీ వెల్లడి  న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌)ల జోరు పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో రూ.145 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత ఎనిమిది నెలలుగా ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు సొమ్ములు వెనక్కి తీసుకోవడమే గానీ, పెట్టుబడులు పెట్టింది లేదు. కానీ ఆగస్టులో మాత్రం పెట్టుబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటం, పుత్తడి ధరలు

Most from this category