News


2019-20లో వృద్ధి 5.5 శాతమే: ఫిచ్‌ అంచనా

Friday 25th October 2019
news_main1571973145.png-29119

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌  తగ్గించింది. 2019-20లో కేవలం 5.5 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదవుతుందని విశ్లేషించింది. ఈ ఏడాది జూన్‌లో ఫిచ్‌ తొలి అంచనా ప్రకారం ఈ రేటు 6.6 శాతం. బ్యాంకింగ్‌ రుణ వృద్ధి పడిపోవడాన్ని ఫిచ్‌ ఈ సందర్భంగా ఉటంకించింది. అయితే వృద్ధి రేటు 2020-21లో 6.2 శాతానికి పెరుగుతుందన్న అంచనా వేసిన ఫిచ్‌ ఇందుకు కేంద్రం, ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు ఫలితాలను ఇస్తాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిచ్‌ తాజా అంచనా.. ఆర్‌బీఐ 6.1 శాతం అంచనాకన్నా తక్కువగా ఉండడం గమనార్హం. పరివర్తన దిశలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ: ఎస్‌బీఐ చైర్మన్‌
భారత్‌ ఆర్థిక వ్యవస్థ పరివర్తన దిశలో ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. అయితే దేశం తిరిగి ఉన్నత వృద్ధి బాటలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పలు సంవత్సరాలుగా తీసుకుంటున్న సంస్కరణలు ఇందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. 
 



You may be interested

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ నష్టాలు రూ.1,062 ‍ కోట్లు

Friday 25th October 2019

31 శాతం వృద్ధితో రూ.8,540కోట్లకు ఆదాయం  -రుణ భారం రూ.19,842 కోట్లు  న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, ఇండిగో మాతృ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) సెప్టెంబర్‌ క్వార్టర్‌లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో రూ.652 కోట్ల నికర నష్టాలు రాగా ఈ క్యూ2లో ఈ నష్టాలు రూ.1,062 కోట్లకు పెరిగాయని ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. లీజు ఆస్తుల నిర్వహణకు సంబంధించి రూ.428 కోట్ల ఫారెక్స్‌

స్వల్పనష్టంతో ముగింపు

Thursday 24th October 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిపలాడిన సూచీలు చివరికి నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టంతో 39,020 వద్ద స్థిరపడింది, నిఫ్టీ 22 పాయింట్ల క్షీణతతో 11600 దిగువున 11,582.40 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., నేడు రెండో రోజూ దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 269 పాయింట్ల లాభపడి  39,327.15,  నిఫ్టీ 65

Most from this category