News


గూగుల్ చేతికి ఫిట్‌బిట్‌

Saturday 2nd November 2019
news_main1572667738.png-29299

  • 2.1 బిలియన్ డాలర్ల డీల్‌

వాషింగ్టన్‌: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా వేరబుల్ టెక్నాలజీ సంస్థ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ డీల్ విలువ 2.1 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆరోగ్యవంతమైన జీవనం సాగించేందుకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.8 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు తమ ఉత్పత్తులను విశ్వసిస్తున్నారని ఈ సందర్భంగా ఫిట్‌బిట్‌ సహ-వ్యవస్థాపకుడు, సీఈవో జేమ్స్ పార్క్ తెలిపారు. అత్యుత్తమమైన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో ఫిట్‌నెస్ బ్యాండ్స్ తదితర వేరబుల్ ఉత్పత్తులను మరింత మెరుగుపర్చేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడగలదని గూగుల్ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ (డివైజెస్‌, సర్వీసెస్ విభాగం) రిక్ ఓస్టర్‌లో తెలిపారు. వేరబుల్స్ విభాగంలోకి అందరికన్నా ముందుగా ప్రవేశించినప్పటికీ.. ఇతర సంస్థలతో పోటీ కారణంగా వెనుకబడుతున్న ఫిట్‌బిట్‌కు ఈ డీల్ ప్రయోజనకరంగా ఉండనుంది. మరోవైపు, ఆన్‌లైన్‌ సెర్చిలో గుత్తాధిపత్యం ఆరోపణలు ఎదుర్కొంటుండంతో.. ఇతరత్రా హార్డ్‌వేర్‌ ఉత్పత్తులపైనా దృష్టి పెడుతున్న గూగుల్‌కు కూడా ఇది ఉపయోగపడనుంది. 



You may be interested

సిగ్నిటీ టెక్నాలజీస్‌కు రూ.36 కోట్ల లాభం

Saturday 2nd November 2019

హైదరాబాద్‌: సిగ్నిటీ టెక్నాలజీస్‌ సంస్థ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.215 కోట్ల టర్నోవర్‌పై రూ.36 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రింత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.205 కోట్ల ఆదాయంతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదైంది. కానీ, నికర లాభం మాత్రం క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.49.52 కోట్లతో పోలిస్తే 25 శాతం వరకు తగ్గినట్టు తెలుస్తోంది. కానీ, సీక్వెన్షియల్‌గా చూస్తే మాత్రం

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఎస్‌ఎఫ్‌ఐవో దర్యాప్తు

Saturday 2nd November 2019

న్యూఢిల్లీ: రుణాల సంస్థ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)లో ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కేంద్రం దృష్టి సారించింది. నిధుల మళ్లింపు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బైటపడుతుండటంతో.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ (ఎస్‌ఎఫ్‌ఐవో)ను ఆదేశించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో దాదాపు రూ. 31,000 కోట్లను డొల్ల కంపెనీల ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు మళ్లించేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిని క్షుణ్నంగా

Most from this category