News


రూ.5.47 లక్షల కోట్లకు ద్రవ్యలోటు

Saturday 31st August 2019
news_main1567230803.png-28127

  • బడ్జెట్‌ అంచనాల్లో ఇప్పటికే 77.8 శాతానికి చేరిక

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు జూలై నాటికి రూ.5,47,605 లక్షల కోట్లకు చేరింది. 2019-20 మొత్తం బడ్జెట్‌ లక్ష్యంలో 77.8 శాతానికి చేరింది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ తాజా గణాంకాలను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలకు ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్‌ (2018-19) అంచనాల్లో 86.5 శాతంగా ఉంది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 7.03 లక్షల కోట్లుగా ఉండాలని బడ్జెట్‌ నిర్దేశించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో చూస్తే ఈ పరిమాణం 3.3 శాతం. 



You may be interested

ఉద్యోగులను తొలగిస్తున్న ఆటో కంపెనీలు!

Saturday 31st August 2019

 వరుసగా తొమ్మిదివ నెలలో(జులై) కూడా వాహనాల అమ్మకాలు క్షీణించడంతో దేశియ ఆటో రంగ సంస్థలు తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. అంతేకాకుండా ఖర్చులను అదుపులో ఉంచడానికి తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నాయని రాయిటర్స్ ఓ నివేదికలో పేర్కొంది. క్షీణిస్తున్న అమ్మకాలను ఎదుర్కోడానికి జపనీస్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్, దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ తమ కంపెనీల ఉత్పత్తిలో కొన్ని భాగాలను నిలిపివేశాయని రాయిటర్స్‌ తెలిపింది. జూలై నెలలో ప్రయాణీకుల

ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌లో ఐఎల్‌ఏ

Saturday 31st August 2019

ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌లో ఐఎల్‌ఏ ఎస్‌బీఐ కార్డ్‌ సంస్థ తన మొబైల్‌ యాప్‌లోకి చాట్‌బాట్‌ ఐఎల్‌ఏ (ఇంటరాక్టివ్‌ లైవ్‌ అసిస్టెంట్‌) ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని తీసుకురావడమే దీన్ని ఉద్దేశ్యం. 40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఏను ఆఫర్‌ చేస్తున్న తొలి సంస్థగా ఎస్‌బీఐ కార్డు నిలుస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ కన్వర్షన్‌, బ్యాలన్స్‌ బదిలీ, క్రెడిట్‌ కార్డుపై రుణం, ఇతర అకౌంట్‌

Most from this category